దేశంలోని సైబర్ మోసగాళ్లు అమాయకులను టార్గెట్ చేస్తూ మోసాలకు పాల్పడుతున్నారు. చాలా సందర్భాల్లో ఈ మోసాల వల్ల అమాయకుల బ్యాంక్ ఖాతాలలోని నగదు మాయమవుతోంది. చాలా సందర్భాల్లో మనం చేసే చిన్నచిన్న తప్పులే సైబర్ మోసాల బారిన పడటానికి కారణమవుతాయి. స్మార్ట్ ఫోన్లలో అనవరసమైన యాప్స్ ను ఇన్ స్టాల్ చేసుకున్నా సైబర్ మోసాల బారిన పడే అవకాశాలు ఉంటాయి.
కొన్ని మొబైల్ యాప్స్ ను ఎట్టి పరిస్థితుల్లోనూ మొబైల్ లో ఇన్ స్టాల్ చేసుకోకూడదు. కొన్ని యాప్స్ మొబైల్స్ లో ఉంటే ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితులు ఏర్పడతాయి. టీమ్ వ్యూయర్ , మైక్రోసాఫ్ట్ రిమోట్ డెస్క్ టాప్, అనీ డెస్క్ ఎయిర్ డ్రాయిడ్, ఎయిర్ మిర్రర్, క్రోమ్ రిమోట్ డెస్క్ టాప్, స్లాష్ టాప్ పర్సనల్ – రిమోట్ డెస్క్ టాప్ యాప్ లను ఎట్టి పరిస్థితుల్లోనూ మొబైల్ ఫోన్స్ లో ఇన్ స్టాల్ చేసుకోకూడదు.
పైన పేర్కొన్న యాప్స్ లో కొన్ని యాప్స్ వల్ల మనకు ప్రయోజనాలు ఉన్నప్పటికీ సైబర్ మోసగాళ్లు ఈ యాప్స్ సహాయంతో మన మొబైల్ లో డేటాను, బ్యాంక్ ఖాతాలకు సంబంధించిన వివరాలను తస్కరించే అవకాశం ఉంది. ఈ ఏడు యాప్స్ ద్వారా సైబర్ మోసగాళ్లు మనం స్మార్ట్ ఫోన్లలో, కంప్యూటర్లలో ఏం చేస్తున్నామో కూడా సులభంగా తెలుసుకునే అవకాశాలు ఉంటాయి.
ఈ యాప్స్ వల్ల వన్ టైమ్ పాస్ వర్డ్, బ్యాంక్ అకౌంట్ వివరాలను పంచుకుని బ్యాంక్ అకౌంట్ లోని డబ్బులను తీసుకునే అవకాశాలు ఉంటాయి. మీ మొబైల్ ఫోన్లలో ఇప్పటికే ఈ యాప్స్ ఇన్ స్టాల్ అయి ఉంటే వీలైతే డిలేట్ చేయడం మంచిది. యాప్స్ అన్ ఇన్ స్టాల్ చేయకపోతే మాత్రం ఇబ్బందులు పడక తప్పదు.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…