Tag Archives: 5G technology

స్మార్ట్ ఫోన్ వాడుతున్నారా? అయితే శుభవార్త మీకోసమే!

స్మార్ట్ ఫోన్ ఉపయోగించే వినియోగదారులకు శుభవార్త ను తెలియజేస్తూ కేంద్ర ప్రభుత్వం ఒక కీలక నిర్ణయాన్ని తీసుకుంది.డిపార్ట్‌మెంట్ ఆఫ్ టెలికం (డాట్) మంగళవారం టెలికం సర్వీస్ ప్రొవైడర్లకు అనుమతులు ఇచ్చింది. ఇందులో భాగంగానే 5జీ టెక్నాలజీ ట్రయల్స్ నిర్వహించుకోవచ్చని టెలికం కంపెనీలకు కేంద్ర ప్రభుత్వం అనుమతులు జారీ చేసింది.

ఈ నేపథ్యంలోనే ఎయిర్టెల్, రిలయన్స్ జియో, వోడాఫోన్, ఐడియా వంటి కంపెనీలు 5జీ ట్రయల్స్ కోసం దరఖాస్తు చేసుకున్నాయి. ఇందుకుగాను డాట్ అనుమతులను కూడా జారీ చేసింది. ఈ టెలికం సంస్థలన్ని ఒరిజినల్ ఎక్విప్‌మెంట్ మ్యానుఫ్యాక్చరర్స్, టెక్నాలజీ ప్రొవైడర్లతో భాగస్వామ్యం కుదుర్చుకొని 5జీ ట్రయల్స్ నిర్వహిస్తాయి.

ఇందులో భాగంగా ఎయిర్టెల్,రిలయన్స్ జియో, వోడాఫోన్ వంటి కంపెనీలు నోకియా ఎరిక్‌సన్, శాంసంగ్, సీడాట్ వంటి సంస్థలతో జత కట్టి 5జీ ట్రయల్స్ నిర్వహిస్తాయి. ఇందుకు గాను ఈ టెలికం సంస్థలకు కేంద్ర ప్రభుత్వం ఆరు నెలల వరకు గడువు ఇచ్చింది.

ఈ ట్రయల్స్ కోసం రెండు నెలల కాలం పాటు ఉపకరణాలను ఏర్పాటు చేసుకోవాలని సూచించింది. ఈ ట్రైలర్స్ లో భాగంగా పట్టణాలు, గ్రామీణ ప్రాంతాలు,పాక్షిక పట్టణాలు వంటి ప్రదేశాలలో ఈ ట్రయల్స్ నిర్వహించాలని సూచించింది. దీని ద్వారా ప్రతి ప్రాంతంలోనూ 5జీ సేవలు అందుబాటులోకి వస్తాయి.5జీ సేవలు అందుబాటులోకి వస్తే డౌన్లోడ్ స్పీడ్ పది రెట్లు పెరుగుతుందని చెప్పవచ్చు.