స్మార్ట్ ఫోన్ ఉపయోగించే వినియోగదారులకు శుభవార్త ను తెలియజేస్తూ కేంద్ర ప్రభుత్వం ఒక కీలక నిర్ణయాన్ని తీసుకుంది.డిపార్ట్‌మెంట్ ఆఫ్ టెలికం (డాట్) మంగళవారం టెలికం సర్వీస్ ప్రొవైడర్లకు అనుమతులు ఇచ్చింది. ఇందులో భాగంగానే 5జీ టెక్నాలజీ ట్రయల్స్ నిర్వహించుకోవచ్చని టెలికం కంపెనీలకు కేంద్ర ప్రభుత్వం అనుమతులు జారీ చేసింది.
ఈ నేపథ్యంలోనే ఎయిర్టెల్, రిలయన్స్ జియో, వోడాఫోన్, ఐడియా వంటి కంపెనీలు 5జీ ట్రయల్స్ కోసం దరఖాస్తు చేసుకున్నాయి. ఇందుకుగాను డాట్ అనుమతులను కూడా జారీ చేసింది. ఈ టెలికం సంస్థలన్ని ఒరిజినల్ ఎక్విప్‌మెంట్ మ్యానుఫ్యాక్చరర్స్, టెక్నాలజీ ప్రొవైడర్లతో భాగస్వామ్యం కుదుర్చుకొని 5జీ ట్రయల్స్ నిర్వహిస్తాయి.
ఇందులో భాగంగా ఎయిర్టెల్,రిలయన్స్ జియో, వోడాఫోన్ వంటి కంపెనీలు నోకియా ఎరిక్‌సన్, శాంసంగ్, సీడాట్ వంటి సంస్థలతో జత కట్టి 5జీ ట్రయల్స్ నిర్వహిస్తాయి. ఇందుకు గాను ఈ టెలికం సంస్థలకు కేంద్ర ప్రభుత్వం ఆరు నెలల వరకు గడువు ఇచ్చింది.
ఈ ట్రయల్స్ కోసం రెండు నెలల కాలం పాటు ఉపకరణాలను ఏర్పాటు చేసుకోవాలని సూచించింది. ఈ ట్రైలర్స్ లో భాగంగా పట్టణాలు, గ్రామీణ ప్రాంతాలు,పాక్షిక పట్టణాలు వంటి ప్రదేశాలలో ఈ ట్రయల్స్ నిర్వహించాలని సూచించింది. దీని ద్వారా ప్రతి ప్రాంతంలోనూ 5జీ సేవలు అందుబాటులోకి వస్తాయి.5జీ సేవలు అందుబాటులోకి వస్తే డౌన్లోడ్ స్పీడ్ పది రెట్లు పెరుగుతుందని చెప్పవచ్చు.
తలనొప్పి అనేది ప్రతి ఒక్కరి జీవితంలో ఎప్పుడో ఒకసారి ఎదురయ్యే సాధారణ సమస్య. పని ఒత్తిడి, నిద్రలేమి, ఆందోళన, ఆకలి,…
ఫుడ్ కంపెనీలపై ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ కొరడా.. ‘హెల్తీ’, ‘ఆర్గానిక్’ పేర్లతో వినియోగదారులను మభ్యపెడుతున్నారా? ఈ రోజుల్లో మార్కెట్‌లో అడుగుపెడితే ప్రతి రెండో…
తల్లి గర్భంలో పెరుగుతున్న శిశువు గురించి ఎన్నో ఆసక్తికర విషయాలు మనం వింటూ ఉంటాం. అయితే గర్భంలో ఉన్న బిడ్డ…
జనసేన పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ మరోసారి తన రాజకీయ వైఖరిని స్పష్టంగా వెల్లడించారు. దేశ…
ఇటీవలి కాలంలో బరువు తగ్గడం కోసం ప్రజలు అనుసరిస్తున్న పద్ధతుల్లో ఒకటి రాత్రి భోజనం మానేయడం. ఉదయం అల్పాహారం, మధ్యాహ్న…
పెళ్లి అనేది ఒక వ్యక్తి జీవితంలో అత్యంత కీలకమైన మలుపు. ముఖ్యంగా మహిళలకు పెళ్లి తర్వాత జీవితం పూర్తిగా కొత్త…