ఒకప్పుడు కార్లను చేతుల మీదకు ఎక్కించుకోవడం, ఒట్టి చేతులతో ఇటుకలు, రాళ్లు, కొబ్బరి బోండాలు పగలగొట్టడం,తాళ్ల సహాయంతో నోటి ద్వారా వాహనాలను లాగడం వంటి సాహసాలు ఎక్కువగా ట్రెండ్ అయ్యేవి. కానీ ప్రస్తుతం మాత్రం టాయిలెట్ సీట్లను బద్దలు కొట్టడం ట్రెండ్ గా మారింది. టాయిలెట్ సీట్లను బద్దలు కొట్టడం అంటే కర్రతోనో చేతితోనో కాదండోయ్.. తలతో బద్దలు కొట్టాలి. ప్రస్తుతం ఇదే ట్రెండ్ నడుస్తోంది.
తాజాగా ఇద్దరు వ్యక్తులు టాయిలెట్ పై ఉన్న సీట్లను తలతో బద్దలుకొట్టి గిన్నిస్ బుక్ రికార్డు సొంతం చేసుకున్నారు. గిన్నిస్ వరల్డ్ బుక్ లోరికార్డు సొంతం చేసుకోవడం కోసం ఇద్దరు వ్యక్తులు పోటా పోటీ పడి మరీ టాయిలెట్ సీట్లను తలతో పగలగొట్టారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో గిన్నీస్ వరల్డ్ రికార్డ్సకు చెందిన ఫేస్‌బుక్ పేజీలో పోస్ట్ చేసిన ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఈ సందర్భంగా ఎవరు ఎక్కువ టాయిలెట్ సీట్లను తలతో బద్దలు కొడతారో వారే విజేత.ఈ పోటీని గిన్నీస్ బుక్ రికార్డుల్లో కూడా నమోదవుతుంది. దీంతో పోటీ మహా రంజుగా సాగింది. పోటీలో భాగంగా చెక్కతో తయారుచేసిన టాయిలెట్ సీట్లను తలతో బద్దలు కొట్టాలి. ఇందులో భాగంగానే మొదటి వ్యక్తి తల తో ఏకంగా43 టాయిలెట్ సీట్లను పగలగొట్టగా, రెండవ వ్యక్తి ఏకంగా 46 టాయిలెట్ సీట్లను పగలగొట్టి విజయం సాధించాడు. ఈ విధంగా రెండవ వ్యక్తి గిన్నిస్ వరల్డ్ రికార్డును సొంతం చేసుకున్నారు. మరి ఈ సాహసానికి సంబంధించిన ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మరి ఇంకెందుకు ఆలస్యం ఈ సాహస వీడియో పై మీరు ఓ లుక్కేయండి.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…