General News

ఆ అనుభవం కోసం మాంసాన్ని అలా చేసి తింటున్నారు.. ఎక్కడంటే?

ప్రస్తుత కాలంలో చాలా మంది ఉదయం చేసిన ఆహారాన్ని సాయంత్రం తినాలంటే ఎంతో ఇబ్బంది పడుతుంటారు. మరికొందరైతే ఏ పూటకాపూట ఫ్రెష్ గా తయారు చేసుకొని తింటుంటారు. ఈ విధంగా తమ ఆహార విషయంలో ఎన్నో జాగ్రత్తలు పాటిస్తూ ఉంటారు. కానీ ఈ మధ్య కాలంలో కొంతమంది మాంసాన్ని కుళ్ళు పెట్టుకొని మరీ తింటున్నారు. వినడానికి ఎంతో చిరాగ్గా అనిపించినా ఈ విధమైన మాంసం తినడం వల్ల వారికి ఎంతో కిక్ ఎక్కుతుందని, ఆ అనుభూతిని మాటల్లో చెప్పలేమని తెలుపుతున్నారు.

సాధారణంగా కుళ్ళిన మాంసం అంటే రెండు మూడు రోజులు పాటు కుళ్ళి పెట్టినది కాదు. కొన్నేళ్ల పాటు కుళ్ళి పెట్టిన మాంసాన్ని తినడం ద్వారా ఆ మాంసం రుచి అన్నిటికంటే ఎంతో భిన్నంగా ఉండటమే కాకుండా,కొకైన్, మారిజోనా, ఎల్‌ఎస్డీ వంటి డ్రగ్స్ ఏ విధంగా మత్తెక్కి ఇస్తాయో ఆ విధమైనటువంటి అనుభూతిని కుళ్ళిన మాంసం ఇస్తుందని తెలిపారు.ఈ అనుభూతిని పొందడం కోసమే మాంసాన్ని కుళ్ళు పెట్టుకొని తింటున్నారు.

ఈ విధంగా కుళ్ళిన ఆహారం ప్రస్తుత కాలంలోది కాదు 2017 వ సంవత్సరంలోనే . ‘sv3ige’ అనే యూట్యూబర్ తొలిసారిగా ఏడాది కిందట నిల్వ ఉంచిన మాంసాన్ని తిని ఆశ్చర్యపరిచాడు. అయితే ఈ వీడియో అక్కడితో ఆగి పోయిన మరికొందరు మాత్రం ఈ వీడియోని షేర్ చేస్తూ ట్రెండ్ చేస్తున్నారు.తాజాగా ట్విట్టర్ యూజర్ కూడా ఈ విధంగా కుళ్ళిన మాంసం తిని తన అనుభూతిని సోషల్ మీడియా ద్వారా షేర్ చేసుకున్నారు.ఈ సందర్భంగా ఒక యూజర్ కుళ్ళిన మాంసం తినడం వల్ల నీకు ఏ విధమైనటువంటి ఆరోగ్య సమస్యలు లేవా? అని ప్రశ్నించగా అందుకు అతను తనకు ఎలాంటి సమస్య ఎదురుకాలేదు అని తెలిపాడు.

ఈ విధంగా ఏడాదిపాటు కుళ్ళు పెట్టిన మాంసాహారం తినడం వల్లవారికి అనుభూతి కలగడం ఏమో కానీ ఈ మాంసం పై అనేక సూక్ష్మ జీవులు, బ్యాక్టీరియాలు పెరిగి తీవ్రమైన అనారోగ్యానికి గురి చేస్తుందని నిపుణులు చెబుతున్నారు. కనుక ఎవరు కూడా ఈ విధమైనటువంటి ప్రయత్నాలు చేయవద్దని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago