తలపై నెమలి పించం, పెదాలపై వేణువు కలిగి చుట్టూ గోపికలతో ఎంతో అల్లరి చేసే కృష్ణుడు ఈ భూమిపై మానవ సంక్షేమం కోసమే బతికాడు. అదేవిధంగా తనను కోరికలు కోరిన వారికి కోరికలు తీర్చే నీలి మేఘశ్యాముడుగా పేరుగాంచాడు. విష్ణుమూర్తి ఎనిమిదవ అవతారంగా వచ్చినదే శ్రీకృష్ణ అవతారం
శ్రీ కృష్ణుడు ప్రపంచంలో అన్ని కష్టాలను ఓడించే భగవద్గీత అనే జ్ఞానాన్ని మనకు అందించాడు.శ్రావణ మాసంలోని కృష్ణ పక్షం అష్టమి తిథిన రోహిణి నక్షత్ర లగ్నమందు జన్మించిన శ్రీ కృష్ణుడికి ఇద్దరు తల్లులు ఉన్నారని అందరికి తెలుసు. అయితే కన్నయ్యకు ఐదుగురు తల్లులు ఉన్నారని మీకు తెలుసా? అయితే ఆ అయిదుగురు తల్లులు ఎవరు ఇక్కడ తెలుసుకుందాం..
దేవకి: వసుదేవుడు సతీమణి అయిన దేవకి.. శ్రీ కృష్ణుడి నిజమైన తల్లి. శ్రావణ మాసంలో కృష్ణ పక్షంలో నందు చెరసాలలో దేవకికి శ్రీకృష్ణుడికి జన్మనిచ్చింది. శ్రీకృష్ణుడు వసుదేవుడు సతీమణికి జన్మించడం వల్ల కృష్ణుడిని దేవకి నందనుడు, వాసుదేవుడు అని కూడా పిలుస్తారు.
యశోద:
కన్నయ్య యశోదను కనుకపోయినప్పటికీ కన్నతల్లిలా పెంచింది. చెరసాల నుంచి వసుదేవుడు శ్రీ కృష్ణుడిని ఎత్తుకొని గోకులంలో యశోద ఇంటికి చేరుస్తాడు. ఈ విధంగా యశోద కన్నయ్యను పెంచి పెద్ద చేసింది.
రోహిణి: వసుదేవుడు తండ్రి దేవకీ కంటే ముందుగా రోహిణిని వివాహమాడాడు.బలరాముడు, సుభద్ర, ఏకాంగ దేవి వీరి సంతానం. ఈ విధంగా రోహిణి కూడా శ్రీకృష్ణుడికి సవతి తల్లి అని చెప్పవచ్చు.
సుముఖీ దేవి: సందీపని ముని భార్య అయిన సుముఖి దేవికి శ్రీకృష్ణుడు తన తల్లి హోదా ఇచ్చాడు.కృష్ణుడు, బలరాముడు, సుదాముడు.. సందీపని మహర్షి దగ్గర విద్యాభ్యాసం చేశారు. అయితే గురుదక్షిణగా సుముఖి దేవి కృష్ణుడి తల్లిగా హోదా అడగటంతో ఈమె కూడా శ్రీకృష్ణునికి తల్లిగా భావించారు.
పూతన: కృష్ణుడిని గోకులంలో హతమార్చడం కోసం నూతన అనే రాక్షసుని పంపుతాడు. పాలు తాగే వయసులో ఉన్న కన్నయ్యను చంపడం కోసం పోతన తన రూములోవిషాన్ని నింపుకొని ఉంటుంది.ఇది ముందుగానే గ్రహించిన కన్నయ్య ఆమె రొమ్ముల ద్వారా విషంతో పాటు రక్తాన్ని కూడా పీల్చి ఆమెను హతమారుస్తాడు.తరువాత తన దహన సంస్కారాలు నిర్వహించగా ఆమె శరీరం నుంచి సుగంధ పరిమళాలు వ్యాపించడంతో కృష్ణుడు ఆమెకు తల్లి హోదాను కల్పించాడు. ఈ విధంగా శ్రీకృష్ణుడికి ఐదుగురు తల్లులు అని చెప్పవచ్చు.
ప్రకృతిలో జరిగే కొన్ని ఖగోళ అద్భుతాలు మన కళ్లకు నేరుగా కనిపించకపోయినా వాటి ప్రభావాన్ని మాత్రం మనం స్పష్టంగా అనుభవిస్తాం.…
చిన్న వయసులో ఆరోగ్యం గురించి పెద్దగా ఆలోచించని వారు చాలా మంది ఉంటారు. "ఇప్పుడేం కాదు.. తర్వాత చూసుకుందాం", "ఇంకా…
ఈ రోజుల్లో డబ్బు లేకుండా ఏ పని జరగని పరిస్థితి. ఉదయం ఇంటి నుంచి బయటకు అడుగు పెట్టిన దగ్గర…
మన తెలుగు వంటింట్లో కరివేపాకుకు ప్రత్యేక స్థానం ఉంది. పప్పు నుంచి పులుసు వరకు, చట్నీ నుంచి ఫ్రై వరకు…
హైదరాబాద్, జూన్ 20: నిర్మొహమాటంగా నికార్సుగా చెప్పాల్సి వస్తే తెలుగు రాష్ట్రాల్లో నిస్వార్ధ సేవకు నిలువెత్తు అక్షరంగా ప్రతిభతో, ప్రజ్ఞతో,…
వంట చేయడం ఒక కళ. అందులో రుచి రావాలంటే ఉప్పు, కారం, మసాలాలు అన్నీ సరైన మోతాదులో ఉండాలి. అయితే…