Tag Archives: 7th pay commission

7th Pay Commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త..! డీఏ పెంపు..!

7th Pay Commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త. సుదీర్ఘ నిరీక్షణ తర్వాత డియర్ నెస్ అలవెన్స్(DA) 3 శాతం పెంచుతూ నిర్ణయం తీసుకుంది. దీంతో ఇప్పుడున్న ఉద్యోగులు, పెన్షనర్లకు 34 శాతం డీఏ పొందుతారు. జనవరి 2022 నుంచి మొత్తం డియర్నెస్ అలవెన్స్ 34 శాతం సెట్ చేశారు. 

7th Pay Commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త..! డీఏ పెంపు..!

7వ వేతన సంఘం సిఫార్సులు ప్రకారం బేసిక్ జీతంపూ మాత్రమే డియర్ నెస్ అలవెన్స్ చెల్లిస్తారు. దీన్ని మార్చిలో ప్రకటించ వచ్చని భావిస్తున్నారు. ప్రస్తుతం ఎన్నికల కారణంగా ప్రభుత్వం వీటిని ప్రకటించలేదు. ప్రభుత్వ నిర్ణయంతో 50 లక్షల మంది కేంద్ర ఉద్యోగులు, 65 లక్షల మంది పెన్షనర్లకు ప్రయోజనం చేకూరుతోంది. తదుపరి డియర్నెస్ అలవెన్స్ జూలై 2022లో లెక్కిస్తారు. డిసెంబర్ 2021కి సంబంధించిన AICPI-IW డేటా విడుదల చేశారు. 

7th Pay Commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త..! డీఏ పెంపు..!

ప్రస్తుతం ఈ గణాంకాల ప్రకారం డిసెంబర్ లో ఈ సంఖ్య 0.3 పాయింట్లు తగ్గి 125.4 పాయింట్లకు చేరకుంది. నవంబర్లో 125.7 పాయింట్లు ఉంది. డిసెంబర్ లో 0.24 తగ్గింది. కానీ ఇది డియర్ నెస్ అలెవెన్స్ పై ప్రభావం చూపించలేదు. 

కార్మిక శాఖ లెక్కల ప్రకారం.. ఇలా

కార్మిక మంత్రిత్వ శాఖ కు చెందిన ఏఐసీపీఐ ఐడబ్ల్యూ గణాంకాల తర్కవాత ఈ సారి డీఏ అలెవెన్స్ 3 శాతం పెంచాలని నిర్ణయించారు. 34 శాతం డీఏపై లెక్కింపు డియర్ నెస్ అలెవెన్స్ 3 శాతం పెంచిన తర్వాత మొత్తం డీఏ 34 శాతం అవుతుంది. ఇప్పుడు రూ. 18,000 బేసిక్ జీతంపూ వార్షిక పెరుగుదల రూ. 6480 అవుతుంది. పెరుగనున్న జీతం ప్రకారం 1. ఉద్యో గి ప్రాథమిక వేతనం రూ. 18,000, 2. కొత్త డియర్నెస్ అలవెన్స్ (34%) రూ. 6120/నెలకు, 3. డియర్నెస్ అలవెన్స్ ఇప్పటివరకు (31%) రూ. 5580/నెల, 4. ఎంత డియర్నెస్ అలవెన్స్ పెరిగింది 6120- 5580 = రూ. 540/నెలకు, 5. వార్షికర్షి జీతంలో పెరుగుదల 540X12 = రూ. 6,4 గా ఉండనుంది

ఉద్యోగులు, పెన్షనర్లకు మోదీ గుడ్ న్యూస్.. ఈ నెలలోనే నగదు జమ..?

2021 సంవత్సరం ప్రారంభమై 5 రోజులైంది. కరోనా, లాక్ డౌన్ నిబంధనల వల్ల గతేడాది దేశంలోని ప్రభుత్వ, ప్రైవేట్ రంగ సంస్థల ఉద్యోగులు, వ్యాపారులు తీవ్రంగా నష్టపోయారు. ఈ ఏడాదైనా పరిస్థితులు మారతాయని సంతోషంతో, ఆరోగ్యంతో జీవనం సాగిస్తామని ప్రజలు భావిస్తున్నారు. ఇదే సమయంలో ఉద్యోగులు, పెన్షనర్లకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుభవార్త చెప్పడానికి సిద్ధమవుతున్నారని తెలుస్తోంది.

ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు ఈ నెలలో డియర్‌నెస్ అలవెన్స్ ను పొందే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. 4 శాతం డియర్‌నెస్ అలవెన్స్ పెరిగే అవకాశం ఉందని వార్తలు వస్తున్న నేపథ్యంలో డియర్ నెస్ అలవెన్స్ పెరిగితే ఉద్యోగులు,వ్యాపారులకు భారీగా ప్రయోజనం చేకూరనుంది. 2020 సంవత్సరం మార్చి నెలలో వేతనం పెంపు నిర్ణయం అమలు జరిగింది. నివేదికలు ఏడవ వేతన కమిషన్ సిఫార్సులను బట్టి వేతన పెంపు ఉంటుందని తెలిపాయి.

2020 సంవత్సరం జనవరి నెల నుంచే వేతన పెంపు అమలవుతుందని ప్రకటన వెలువడినా కరోనా మహమ్మారి విజృంభణ వల్ల, డియర్‌నెస్ అలవెన్స్ పెంపు అమలులోకి రాలేదు. డియర్‌నెస్ అలవెన్స్ పెంపు లేకపోవడంతో ఉద్యోగులు, పెన్షనర్లు తీవ్రంగా నష్టపోయారు. డీఏ పెంపు అమలైతే 65 లక్షల మన్డి పెన్షనర్లు, 48 లక్షల మంది ఉద్యోగులకు ప్రయోజనం చేకూరుతుంది.

ఉద్యోగులు, పెన్షనర్లు డియర్‌నెస్ అలవెన్స్ పెంపు కోసం ఆశగా ఎదురు చూస్తున్నారు. ఏడవ వేతన సిఫార్సుల ను బట్టి డీఏ పెంపు అమలవుతుంది. కేంద్ర ప్రభుత్వం ఈ నెలలో వేతన పెంపును ఎప్పటినుంచి అమలు చేస్తుందో చూడాల్సి ఉంది.