Tag Archives: Acteess Sri vidhya

Acteess Sri vidhya: స్టార్ హీరోయిన్ ఓ వెలుగు వెలిగిన శ్రీవిద్య మరి ఇంత దారుణంగా మోసపోయారా?

Acteess Sri vidhya: సినిమా ఇండస్ట్రీలో అవకాశం దొరికితే చాలు హీరోయిన్లను వాడుకొని వదిలేయడానికి ఎంతో మంది ఎదురు చూస్తూ ఉంటారు.ఇలా ఎంతోమంది నటీమణులు చాలా తొందరగా మరొకరి చేతిలో మోసపోయి జీవితాన్ని కోల్పోయిన వారు ఉన్నారు. అదేవిధంగా సినిమాలలో సంపాదించినది మొత్తం నమ్మకంతో ఇతరుల చేతులలో పెట్టి చివరికి అనాధలుగా మిగిలిపోయిన వారు ఉన్నారు.

ఇలా జీవితంలో తన జీవితాన్ని కోల్పోవడం కాకుండా దారుణంగా మోసపోయిన వారిలో నటి శ్రీ విద్యా ఒకరు. దివంగత నటి శ్రీవిద్య సైతం ఇలాంటి కోవకు చెందుతారు. శ్రీవిద్య తెలుగు తమిళ కన్నడ సినిమాలలో నటించి ఎంతో మంచి గుర్తింపు పొందారు.శ్రీవిద్య జన్మించిన ఏడాదికి తన తండ్రి అనారోగ్యంతో మృతి చెందడంతో ఈమె తల్లి దీంతో కష్టపడుతూ పెంచారు అయితే ఆర్థిక ఇబ్బందులు చుట్టుముట్టడంతో బాలునట్టుగా ఇండస్ట్రీలోకి వచ్చి అనంతరం హీరోయిన్ గా వెలుగు వెలిగారు.

తాత మనవడు సినిమాలు బాలనటిగా ఎంట్రీ ఇచ్చిన ఈమె అనంతరం ఢిల్లీ టు మద్రాస్ అనే సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చారు.ఇక అప్పట్లో హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగిన ఈమేకు కమల్ హాసన్ తో ప్రేమ ప్రయాణం కొనసాగుతుందని పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి.అయితే కమల్ హాసన్ వాణి గణపతితో ప్రేమలో ఉన్నారని తెలియగానే ఈమె అతనికి దూరంగా ఉన్నారు. ఇలా కమలహాసన్ కు దూరమైన ఈమె డైరెక్టర్ జార్జిథామ‌స్ ప్రేమలో పడ్డారు.

Acteess Sri vidhya: కన్నీటి కష్టాలతో జీవితాన్ని ముగించిన శ్రీవిద్య…

ఇంట్లో వాళ్ళు వద్దన్నా వినకుండా ఈమె తనని పెళ్లి చేసుకుంది అయితే అతను తాగుడుకు చెడు అలవాట్లకు బానిస కావటం వల్ల తన ఆస్తిని మొత్తం నీళ్లలా ఖర్చు చేశారు.ఇలా తనకు విడాకులు ఇచ్చిన ఈమె భరత్ అనే మరో డైరెక్టర్ ని పెళ్లి చేసుకున్నారు ఆయన కూడా ఈమెను మోసం చేసి మరొక పెళ్లి చేసుకున్నారు .ఇలా శ్రీవిద్య ఇండస్ట్రీలో మంచి నటిగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నప్పటికీ ఈమె సంతోషంగా గడిపిన క్షణాలు కన్నా తన జీవితంలో ఎక్కువగా కన్నీటి కష్టాలు ఉన్నాయని చెప్పాలి.