Acteess Sri vidhya: సినిమా ఇండస్ట్రీలో అవకాశం దొరికితే చాలు హీరోయిన్లను వాడుకొని వదిలేయడానికి ఎంతో మంది ఎదురు చూస్తూ ఉంటారు.ఇలా ఎంతోమంది నటీమణులు చాలా తొందరగా మరొకరి చేతిలో మోసపోయి జీవితాన్ని కోల్పోయిన వారు ఉన్నారు. అదేవిధంగా సినిమాలలో సంపాదించినది మొత్తం నమ్మకంతో ఇతరుల చేతులలో పెట్టి చివరికి అనాధలుగా మిగిలిపోయిన వారు ఉన్నారు.
ఇలా జీవితంలో తన జీవితాన్ని కోల్పోవడం కాకుండా దారుణంగా మోసపోయిన వారిలో నటి శ్రీ విద్యా ఒకరు. దివంగత నటి శ్రీవిద్య సైతం ఇలాంటి కోవకు చెందుతారు. శ్రీవిద్య తెలుగు తమిళ కన్నడ సినిమాలలో నటించి ఎంతో మంచి గుర్తింపు పొందారు.శ్రీవిద్య జన్మించిన ఏడాదికి తన తండ్రి అనారోగ్యంతో మృతి చెందడంతో ఈమె తల్లి దీంతో కష్టపడుతూ పెంచారు అయితే ఆర్థిక ఇబ్బందులు చుట్టుముట్టడంతో బాలునట్టుగా ఇండస్ట్రీలోకి వచ్చి అనంతరం హీరోయిన్ గా వెలుగు వెలిగారు.
తాత మనవడు సినిమాలు బాలనటిగా ఎంట్రీ ఇచ్చిన ఈమె అనంతరం ఢిల్లీ టు మద్రాస్ అనే సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చారు.ఇక అప్పట్లో హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగిన ఈమేకు కమల్ హాసన్ తో ప్రేమ ప్రయాణం కొనసాగుతుందని పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి.అయితే కమల్ హాసన్ వాణి గణపతితో ప్రేమలో ఉన్నారని తెలియగానే ఈమె అతనికి దూరంగా ఉన్నారు. ఇలా కమలహాసన్ కు దూరమైన ఈమె డైరెక్టర్ జార్జిథామస్ ప్రేమలో పడ్డారు.
ఇంట్లో వాళ్ళు వద్దన్నా వినకుండా ఈమె తనని పెళ్లి చేసుకుంది అయితే అతను తాగుడుకు చెడు అలవాట్లకు బానిస కావటం వల్ల తన ఆస్తిని మొత్తం నీళ్లలా ఖర్చు చేశారు.ఇలా తనకు విడాకులు ఇచ్చిన ఈమె భరత్ అనే మరో డైరెక్టర్ ని పెళ్లి చేసుకున్నారు ఆయన కూడా ఈమెను మోసం చేసి మరొక పెళ్లి చేసుకున్నారు .ఇలా శ్రీవిద్య ఇండస్ట్రీలో మంచి నటిగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నప్పటికీ ఈమె సంతోషంగా గడిపిన క్షణాలు కన్నా తన జీవితంలో ఎక్కువగా కన్నీటి కష్టాలు ఉన్నాయని చెప్పాలి.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…