Categories: FeaturedMovie News

Anupama Parameswaran: ఆ హీరోతో కలిసి నైట్ సినిమాకి వెళ్లాను.. అనుపమ పరమేశ్వరన్ షాకింగ్ కామెంట్స్?

Anupama Parameswaran: మలయాళ కుట్టి అనుపమ పరమేశ్వరన్ గురించి పరిచయం అవసరం లేదు. త్రివిక్రమ్ శ్రీనివాస్ తో ఇండస్ట్రీకి పరిచయమైన ఈమె తెలుగులో పలు సినిమాలలో నటిస్తూ బిజీగా ఉన్నారు. ఈ క్రమంలోని తాజాగా నిఖిల్ సరసన ఈమె కార్తికేయ 2 సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ సినిమా ఆగస్టు 13వ తేదీ ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఈ క్రమంలోనే పెద్ద ఎత్తున సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు.ఈ ఇంటర్వ్యూలో భాగంగా ఈమె పలు ఆసక్తికరమైన విషయాలను తెలియజేశారు. సాధారణంగా ప్రతి ఒక్క నటి నటులు వారి సినిమా విడుదలైతే తప్పనిసరిగా విడుదలైన రోజు చూస్తారు. మరికొందరైతే వారి నటించిన సినిమాకు ప్రేక్షకుల ఆదరణ ఎలా వస్తుందోనని దొంగ చాటుగా థియేటర్ కి వెళ్లి సినిమా చూసి రావడం చేస్తుంటారు.

ఈ విధంగానే అనుపమ పరమేశ్వరన్ శర్వానంద్ ఇద్దరు కలిసి నటించిన శతమానం భవతి సినిమా విడుదలైన రోజు వీరిద్దరూ కలిసి ఆ రోజు రాత్రి సినిమాకు వెళ్లారని,అయితే వీరిద్దరూ కలిసి నటించిన శతమానం భవతి సినిమాకు మాత్రం కాదంటూ ఈమె షాకింగ్ ట్విస్ట్ ఇచ్చారు. మరి వీరిద్దరూ వీరి నటించిన సినిమా కాకుండా మరో ఏ సినిమాకు వెళ్లారని విషయానికి వస్తే…

Anupama Parameswaran: మెగాస్టార్ కి పెద్ద అభిమానిని…

శతమానం భవతి సినిమా విడుదలైన సమయంలోనే మెగాస్టార్ చిరంజీవి నటించిన ఖైదీ నెంబర్ 150 సినిమా కూడా విడుదలైంది. ఈ క్రమంలోనే వీరిద్దరూ కలిసి మెగాస్టార్ నటించిన ఖైదీ నెంబర్ 150 సినిమా చూడటానికి వెళ్లారని ఈమె వెల్లడించారు.ఇక తనకు మెగాస్టార్ చిరంజీవి అంటే ఇష్టమని తాను థియేటర్లో చూసిన మొదటి సినిమా కూడా అదేనని ఈ సందర్భంగా అనుపమ చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది..

హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…

1 month ago

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

3 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

3 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

3 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

3 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

3 months ago