Tag Archives: actor sunil

Actor Sunil : సునీల్ భార్యను ఎప్పుడైనా చూశారా..? ఆయన ఫ్యామిలీ ఎంత అందంగా ఉందో తెలుసా!

Actor Sunil : టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతో మంది కమెడియన్ లలో స్టార్ కమెడియన్ గా గుర్తింపు తెచ్చుకున్న వారిలో సునీల్ ఒకరు.సినిమా ఇండస్ట్రీలో సునీల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అద్భుతమైన కామెడీ టైమింగ్ లో పంచులు వేస్తూ ఎంతో మంది ప్రేక్షకులను ఆకట్టుకున్న సునీల్ ఇండస్ట్రీలోకి రావడంతోనే ఎన్నో విజయవంతమైన సినిమాల్లో నటించి అతి తక్కువ సమయంలోనే స్టార్ కమెడియన్ గుర్తింపును సంపాదించుకున్నారు.

సునీల్ ఇండస్ట్రీలోకి వచ్చిన మొదట్లో కమెడియన్ గా కాకుండా అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేశారు. ఆ తరువాత నువ్వేకావాలి చిత్రం ద్వారా కమెడియన్ గా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన సునీల్ మొట్టమొదటి సినిమాతోనే ఎంతో ఫేమస్ అయ్యారు. ఈ క్రమంలోనే మనసంతా నువ్వే, నువ్వు నేను చిత్రాల ద్వారా బాగా ఫేమస్ అయ్యారు. ఈ విధంగా ఏడాదికి సుమారు 20 చిత్రాల్లో నటిస్తూ ప్రేక్షకులను ఎంతో సందడి చేసిన సునీల్ వ్యక్తిగత విషయాల గురించి చాలా మందికి తెలియదు.

సునీల్ తన కుటుంబాన్ని ఎప్పుడూ కూడా ఇండస్ట్రీకి పరిచయం చేయలేదు. వారికి సంబంధించిన ఫోటోలను కూడా అభిమానులతో పంచుకోలేదు.సునీల్ వ్యక్తిగత విషయానికి వస్తే తన ఐదు సంవత్సరాల వయసులోనే తండ్రిని కోల్పోయాడు.తల్లి సంరక్షణలోనే పెరిగిన సునీల్ కు డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ మంచి స్నేహితులు కావడంతో అతని ప్రోత్సాహంతోనే ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాడు.

అదేవిధంగా ఇండస్ట్రీలోకి వచ్చిన కొద్ది రోజులకే సునీల్ వివాహం జరిగింది. తమ బంధువుల అమ్మాయిని పెళ్లి చేసుకున్న సునీల్ భార్య పేరు శృతి. పెళ్లయినప్పటి నుంచి ఇప్పటివరకు సునీల్ తన భార్య ఫోటోలను ఎప్పుడు కూడా అభిమానులతో పంచుకోలేదు. ప్రస్తుతం సునీల్ కు ఒక పాప, బాబు కూడా ఉన్నాడు.

ఇండస్ట్రీలోకి వచ్చిన కొద్ది రోజుల వరకు కమెడియన్ గా పని చేసిన సునీల్ ఆ తరువాత రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన “మర్యాద రామన్న” సినిమాలో హీరోగా నటించారు. హీరోగా పలు సినిమాల్లో నటించినప్పటికీ తిరిగి కమెడియన్ గా కూడా నటిస్తున్నారు. ప్రస్తుతం సునీల్ పలు చిత్రాల్లో నటిస్తూనే,హరీష్ శంకర్ రాసిన వేదంతా రాఘవయ్య సినిమా ద్వారా హీరోగా రానున్నారు.

ఇండస్ట్రీకి విలన్ అవుదామని వచ్చా.. మోహన్ బాబు అంటే చాలా ఇష్టం : సునీల్

సునీల్.. తెలుగు సినిమా ఇండస్ట్రీలో కమెడియన్ గా తెరంగేట్రం చేసి మధ్యలో హీరోగా కొన్ని సినిమాలు చేసి మళ్లీ కమెడియన్ గా టాలీవుడ్ లో సెటిల్ అయిపోయారు సునీల్. అయితే.. చాలామంది డాక్టర్ కాబోయి యాక్టర్ అయ్యాను అని చెబుతుంటారు. కానీ.. సునీల్ కు మాత్రం చిన్నప్పటి నుంచి సినిమాలు అంటే పిచ్చి. మెగాస్టార్ చిరంజీవిని చూస్తూ పెరిగారు. స్కూల్, కాలేజీ ఎగ్గొట్టి భీమవరంలో రోజూ సినిమాలు చూడటమే సునీల్ పని. మెగాస్టార్ చిరంజీవిలా డ్యాన్స్ వేయాలనుకోవడం, ఆయనలా ఉండాలనుకోవడం, ఆయనలా డ్రెస్సులు వేసుకోవాలనుకోవడం.. ఇలా సునీల్ కు చిన్నతనంలోనే సినిమా అంటే ఒకరకమైన అభిమానం ఏర్పడింది.

అయితే.. సునీల్ తెలుగు సినిమా ఇండస్ట్రీకి రావాలనుకున్నది నిజమే కానీ.. కమెడియన్ అవుదామని మాత్రం రాలేదట. తన ఫేస్ విలన్ కి అయితేనే కరెక్ట్ గా సెట్ అవుతుందని భావించి.. విలన్ అవుదామని హైదరాబాద్ కు వచ్చారట. కానీ.. ఆయనకు ఎక్కువగా కమెడియన్ పాత్రలు రావడంతో కమెడియన్ గా తెలుగు సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నారు సునీల్. మెగాస్టార్ చిరంజీవి తర్వాత.. మోహన్ బాబు పండించే విలనిజం అంటే సునీల్ కు చాలా ఇష్టమట. మోహన్ బాబు విలన్ గా నటించిన సినిమాలు చూసే.. విలన్ అవుదామని ఇండస్ట్రీకి వచ్చారు సునీల్.

త్రివిక్రమ్, నేను ఒకే రూమ్ లో ఉండేవాళ్లం

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్, సునీల్ బెస్ట్ ఫ్రెండ్స్ అనే విషయం తెలిసిందే. ఇండస్ట్రీకి రాకముందు నుంచే సునీల్ కు త్రివిక్రమ్ తెలుసు. త్రివిక్రమ్ సినిమాల్లోకి రాకముందు లెక్చరర్ గా పనిచేసేవారట. లెక్చరర్ గా పనిచేస్తూనే సినిమాల్లో ట్రై చేసేవారట. హైదరాబాద్ కు వచ్చాక.. ఇద్దరూ కలిసి ఒకే రూమ్ లో ఉండి.. సినిమాల్లో ట్రై చేశారట. త్రివిక్రమ్ కూడా తన సినిమాల్లో సునీల్ కు ఎక్కువగా కమెడియన్ రోల్స్ ఇవ్వడంతో.. మిగితా సినిమాల్లో కూడా సునీల్ కు కమెడియన్ రోల్స్ ఎక్కువగా వచ్చాయి. అలా.. విలన్ అవుదామనుకున్న సునీల్ కాస్త.. కమెడియన్ అయ్యాడు.

చిన్నప్పుడు మా అమ్మ పర్సులో డబ్బులు ఎక్కువగా కొట్టేసేవాడిని

సునీల్ తండ్రి తన చిన్నప్పుడే చనిపోయారు. దీంతో.. సునీల్ ను పెంచే బాధ్యత మొత్తం సునీల్ తల్లి మీద పడింది. తను చాలా కష్టపడి మరీ.. సునీల్ ను పెంచింది. చిన్నప్పుడు సినిమాలు చూడటం కోసం.. తన పర్సులో డబ్బులు కొట్టేసి మరీ సినిమాలు చూసేవారట. అలా చిన్నప్పటి నుంచి సినిమాల మీద సునీల్ కు క్రేజ్ ఏర్పడింది.

రామ్ గోపాల్ వర్మ తో సినిమా చేయాలన్నా డ్రీమ్ తోనే అప్పల్రాజు సినిమా చేశా

సునీల్ కు.. రామ్ గోపాల్ వర్మ అంటే చాలా ఇష్టమట. అందుకే.. ఆయనతో తన జీవితంలో ఒక్కసినిమా చేయాలన్న కోరిక ఉండేదట సునీల్ కు. అందుకే.. కథ స్క్రీన్ ప్లే దర్శకత్వం అప్పల్రాజు సినిమాలో నటించారట సునీల్. రామ్ గోపాల్ వర్మ అంటే ఇప్పటికీ సునీల్ కు చాలా ఇష్టమట.

సునీల్ గురించి మనకు తెలియని ఇంకా కొన్ని విషయాలు ఏంటంటే.. సునీల్ కు చాలా సిగ్గు ఎక్కువట. అందుకే అమ్మాయిలతో ఎక్కువగ మాట్లాడడట. ఎవ్వరితోనూ ఎక్కువగా విభేదాలు పెట్టుకోరు. చాలా సింపుల్ గా ఉండే వ్యక్తి. ఇండస్ట్రీలో అందరితో మంచిగా ఉండే వ్యక్తి సునీల్.