Tag Archives: admitted hospital

తీవ్ర అనారోగ్యంతో అపోలో ఆస్పత్రిలో సీనియర్ నటుడు కైకాల.. పరిస్థితి విషమం!

తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎన్నో వందల చిత్రాల్లో విభిన్న పాత్రల్లో నటించి విశేష ప్రేక్షకాదరణ దక్కించుకున్న సీనియర్ నటుడు కైకాల సత్యనారాయణ ఆరోగ్య పరిస్థితి విషమంగా మారింది. దీంతో ఆయన ప్రస్తుతం జూబ్లీహిల్స్ లోని అపోలో ఆస్పత్రిలో చేరి చికిత్స తీసుకుంటున్నారు. ఈ విషయం తెలియడంతో టాలీవుడ్ ఇండస్ట్రీ తీవ్ర ఆందోళన చెందుతుంది.

గత కొద్ది రోజుల క్రితమే కైకాల సత్యనారాయణ ఇంట్లో కాలుజారి కింద పడడంతో ఆయన సికింద్రాబాద్ లోని ఒక ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స తీసుకున్న సంగతి మనకు తెలిసిందే.ఈ క్రమంలోనే అతని ఆరోగ్య పరిస్థితి విషమించడంతో ప్రస్తుతం అపోలో ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నట్లు కుటుంబ సభ్యులు వెల్లడించారు.

1959లో సిపాయి కూతురు అనే సినిమా ద్వారా వెండితెర అరంగ్రేటం చేసినా కైకాల సత్యనారాయణ గత ఆరు దశాబ్దాలుగా ఇండస్ట్రీలో కొనసాగుతూనే ఎన్నో పాత్రల్లో నటించారు. ఈ క్రమంలో తన కెరీర్లో ఏడు వందల చిత్రాలకు పైగా నటించి మంచి ఆదరణ దక్కించుకున్నారు.

అప్పట్లో ఎస్.వి.రంగారావు తర్వాత అలాంటి పాత్రలో నటించిన కైకాల సత్యనారాయణ నేటి తరం సినిమాల్లో కూడా తాత, తండ్రి పాత్రలో నటించి నేటి తరం ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఇలా ఇండస్ట్రీలో సుదీర్ఘ ప్రయాణం చేసిన కైకాల సత్యనారాయణ ప్రస్తుతం అనారోగ్య సమస్యతో ఆస్పత్రి పాలు కావడంతో ఎంతో మంది అభిమానులు తన ఆరోగ్య పరిస్థితి కుదుటపడి తను క్షేమంగా ఇంటికి తిరిగి రావాలని ప్రార్థిస్తున్నారు.

చిరంజీవి చేతికి గాయం.. ఆందోళనలో అభిమానులు..?

మెగస్టార్ చిరంజీవి గురించి ప్రత్యేకగా చెప్పాల్సిన అవసరం లేదు. అటు తన వ్యక్తిగత జీవితంలో తన పని తాను చేసుకుంటూ.. ఇటు సేవా కార్యక్రమాలను నిర్వహిస్తూ ఉంటారు. బ్లడ్ బ్యాంక్, ఆక్సిజన్ బ్యాంక్ లాంటి సేవా కార్యక్రమాలను ప్రారంభించి పేదలకు ఎంతో అండగా నిలిచాడు. కరోనా మహమ్మారి విజృంభించి తెలుగు రాష్ట్ర ప్రజలందరినీ ఇబ్బంది పెడుతున్న సమయంలో ఆక్సిజన్ బ్యాంకు ద్వారా సేవలు అందించిన మెగా అభిమానులతో మెగాస్టార్ చిరంజీవి భేటీ అయ్యారు.

అన్ని జిల్లాల మెగా అభిమాన సంఘాల ప్రతినిధులు ఇందులో పాల్గొన్నారు. వారిని చిరంజీవి ప్రత్యేకంగా అభినందించారు. హైదరాబాద్ చిరంజీవి బ్లడ్ బ్యాంక్ వేదికగా ఈ కార్యక్రమం జరిగింది. ఇందులో చిరంజీవి పాల్గొనగా ఆయన కుడి చేతికి బ్యాండేజ్ కనిపించింది. దీంతో అభిమానులందరూ ఒక్కసారిగా షాక్ గురయ్యారు. కొన్ని క్షణాలపాటు ఆ బ్యాండేజ్ అభిమానులందరినీ కలవరపెట్టింది. ఏమైంది అని అభిమానులు చిరంజీవిని ప్రశ్నించగా చిరంజీవి అసలు విషయం చెప్పారు.

తన అరచేతికి చిన్నపాటి సర్జరీ అయినట్లు పేర్కొన్నాడు. కుడిచేతితో ఏ పని చేయాలన్నా కొద్దిగా నొప్పి, తిమ్మిరి అనిపిస్తుందని.. దానికి వైద్యుడిని సంప్రదించగా.. కుడి చేతి మణికట్టు దగ్గరలో ఉన్న మీడియన్ నర్వ్ అనే నరం మీద ఒత్తిడి పడటం వల్ల అలా అనిపిస్తోందని చెప్పారని చిరంజీవి అన్నారు. దానిని కార్పల్ టన్నెల్ సిండ్రోమ్ అంటారని డాక్టర్లు వెల్లడించినట్లు పేర్కొన్నారు. దీనికి వైద్యులు సర్జరీ చేయాలని చెప్పడంతో.. అపోలో ఆసుపత్రిలో కాస్మోటిక్ సర్జన్ వైద్యుడు సుధాకర్ రెడ్డి ఆధ్వర్యంలో చేతికి సర్జరీ జరిగిందన్నారు.

ఈ సర్జరీ వల్లనే ప్రస్తుంతం జరుగుతున్న గాడ్ ఫాదర్ సినిమా షూటింగ్ కి కూడా గ్యాప్ ఇచ్చానని అతడు వెల్లడించారు. ఫైట్ సీక్వెన్స్ చేయాల్సి ఉందని.. దానికి తాను 15 రోజుల పాటు గ్యాప్ తీసుకున్నానని.. నవంబర్ లో గాడ్ ఫాదర్ షూటింగ్ లో రెగ్యూలర్ గా పాల్గొంటానని ఆయన పేర్కొన్నాడు. ప్రస్తుతానికి అంతా సెట్ అయింది కాబట్టి పెద్దగా కంగారు పడాల్సిన విషయం ఏమీ లేదన్నారు. ఇక దీనిపై చిరంజీవి క్లారిటీ ఇవ్వడంతో అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు.

సీతాకోకచిలుక నటుడుకి ప్రమాదం.. తీవ్రగాయాలతో ఆస్పత్రిలో చేరిక?

సీతాకోకచిలుక వంటి సూపర్ హిట్ సినిమాలో నటించి ఎంతో మంది తెలుగు అభిమానులకు సొంతం చేసుకున్న తమిళ నటుడు కార్తీక్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తాజాగా ఈ హీరో ఒక ప్రమాదానికి గురైనట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన కార్తీక్ ను ఒక ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు.

నటుడు కార్తీక్ వ్యాయామం చేస్తూ.. ప్రమాదవశాత్తు కింద పడటంతో తలకు, మెడకు తీవ్ర గాయాలైనట్లు తెలుస్తోంది.ఈ క్రమంలోనే అతనిని ఒక ప్రైవేట్ ఆస్పత్రికి చేర్పించి చికిత్స అందించడంతో అతని పరిస్థితి కొద్దిగా మెరుగ్గా ఉన్నట్లు వైద్యులు సూచించారు. ఇకపోతే నటుడు కార్తీక్ గత కొంత కాలం నుంచి శ్వాసకోస, బీపీ వంటి వ్యాధులతో సతమతమవుతున్నట్లు తెలిపారు.

సీతాకోకచిలుక ద్వారా తెలుగులోకి ఎంట్రీ ఇచ్చిన కార్తీక్ ఆ తరువాత అభినందన, అన్వేషణ, అనుబంధం, గోపాలరావు గారి అబ్బాయి వంటి ఎన్నో సినిమాలలో నటించి విశేష ప్రేక్షకాదరణ సంపాదించుకున్నారు. పలు సినిమాలలో నటిస్తూనే మరోవైపు రాజకీయాలలోకి రావాలనే ఆశతో సొంతంగా పార్టీని కూడా స్థాపించాడు. అయితే అనారోగ్య సమస్యల కారణంగా పార్టీని వదులుకున్నారు.

ఇకపోతే నటుడు కార్తీక్ వారసుడిగా గౌతమ్ కార్తీక్ హీరో గా మణిరత్నం దర్శకత్వం వహించిన “కడలి” సినిమా ద్వారా ఎంట్రీ ఇచ్చారు. అయితే ఈ సినిమా ఆశించిన మేర ఫలితాలను ఇవ్వలేకపోయింది. ప్రస్తుతం హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న కార్తీక్ ఆరోగ్య పరిస్థితి అదుపులోనే ఉందని డాక్టర్లు వెల్లడించడంతో అభిమానులు కాస్త ఊపిరి పీల్చుకున్నారు.