Tag Archives: akuchatu pinde tadise

ఎన్టీఆర్ సినిమాలోని ఆ పాట లిరిక్స్ కి సెన్సార్ అభ్యంతరం చెప్పిందని మీకు తెలుసా?

సాధారణంగా ఒక సినిమా చిత్రీకరణ పూర్తి చేసుకున్న తర్వాత ఆ సినిమాను సెన్సార్ బోర్డు పర్యవేక్షించి అందులో ఏవైనా అసభ్యకర పదజాలం, అసభ్యకరమైన సన్నివేశాలు ఉంటే ఆ సన్నివేశాలకు సెన్సార్ బోర్డు అభ్యంతరం తెలియజేస్తుంది. సెన్సార్ బోర్డు అనుమతి పొందిన తర్వాతనే ఏ సినిమా అయినా విడుదల కావాల్సి ఉంటుంది. ఇలా నటసార్వభౌముడు నందమూరి తారక రామారావు నటించిన ఒక సినిమా లోని పాట లిరిక్స్ కి సెన్సార్ బోర్డ్ తీవ్ర అభ్యంతరం తెలిపింది. ఎన్టీఆర్ నటించిన ఆ సినిమా ఏంటి?ఏ పాటకు సెన్సార్ బోర్డు అభ్యంతరం తెలిపింది అనే విషయానికి వస్తే..

కె రాఘవేంద్రరావు నిర్దేశకత్వంలో రోజా మూవీస్ బ్యానర్ పై ఎం అర్జున రాజు నిర్మించిన “వేటగాడు” సినిమాలో నందమూరి తారక రామారావు శ్రీదేవి జంటగా నటించారు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టించింది. ఈ సినిమాలోని ఎవర్ గ్రీన్ పాటగా పేరు సంపాదించిన “ఆకుచాటు పిందె తడిచే” అనే పాట ఎంతో ఫేమస్ అయ్యింది. రాఘవేంద్ర రావు వాటర్ స్పీకర్లను ఉపయోగించి మూడు రోజుల పాటు ఈ పాట చిత్రీకరణ చేశారు. ఈ సినిమా విడుదలైన తర్వాత వర్షం వస్తే అందరి నోటా ఇదే పాట మేదిలేది.

ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకొని సెన్సార్ కు వెళ్ళినప్పుడు ఈ పాటను ఎంతో ఎంజాయ్ చేసిన సెన్సార్ సభ్యులు “ఆకుచాటు పిందె తడిచే” తరువాత వచ్చే “కోకమాటు పిల్ల తడిసే” అనే పదానికి సెన్సార్ అభ్యంతరం తెలిపింది. ఆ సౌండ్ కట్ చేయాలి లేదంటే మరొక పదం అక్కడ రీప్లేస్ చేయాలని చెప్పారు. అదే సమయంలో ఏడిద నాగేశ్వరరావు ఆఫీసులో వేటూరి “శంకరాభరణం” సినిమాకు పాటలు రాస్తున్నారు.

ఈ క్రమంలోనే వేటగాడు సినిమాకు సెన్సార్ అభ్యంతరం చెప్పింది అనే విషయం తెలుసుకున్న వేటూరి ఒక ఐదు నిమిషాల పాటు ఆలోచించి “కోకమాటు పిల్ల తడిచే” మాటల స్థానంలో కొమ్మ చాటు పువ్వు తడిసే అని మాటలు రాసి పంపించడంతో అప్పటికప్పుడు ఆ పదానికి బిట్ తో ఆ పాటను చక్రవర్తి రికార్డు చేసి పంపడంతో సెన్సార్ ఏ విధమైనటువంటి అభ్యంతరం చెప్పలేదు. అలా 1979 లోవిడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన విజయాన్ని అందుకోవడమే కాకుండా ఈ సినిమాలోని ఈ పాట సూపర్ హిట్ అయ్యింది.