Tag Archives: ali tho saradaga

క్లాప్ బోర్డ్ కింద పెట్టడంతో రేలంగి పై చేయి చేసుకున్న స్టార్ డైరెక్టర్ ఎవరో తెలుసా?

సినిమా ఇండస్ట్రీలో డైరెక్టర్ రేలంగి నరసింహారావు ప్రస్థానం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ఎన్నో అద్భుతమైన సినిమాలకు దర్శకత్వం వహించి ఇండస్ట్రీలో మంచి గుర్తింపు సంపాదించుకున్న రేలంగి నరసింహారావు తాజాగా ఆలీతో సరదాగా కార్యక్రమానికి వచ్చారు. ఈ కార్యక్రమంలో భాగంగా తన సినీ జీవితంలో జరిగిన కొన్ని సంఘటనలను ఈ సందర్భంగా గుర్తుచేసుకున్నారు. తాజాగా ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమోను నిర్వాహకులు విడుదల చేశారు.

ఈ ప్రోమోలో భాగంగా ఈ కార్యక్రమంలో కి ఎంటరైన రేలంగి గారికి అలీ సాదర స్వాగతం పలికారు. ఈ విధంగా కార్యక్రమానికి ఎంటరైన రేలంగి నరసింహారావు గారితో మీ ఇంటి పేరు వినగానే ఒక మహానటుడు రేలంగి వెంకట రామయ్య గుర్తుకు వస్తారు ఆయనకు మీకు ఏంటి సంబంధం అని అడగగా ..అందుకు రేలంగి నరసింహారావు సమాధానం చెబుతూ… రాధమ్మ పెళ్లి సినిమా తీసే సమయంలో దూరంగా ఉన్న నన్ను పిలిచి నీ పేరు కేవలం నరసింహారావు మాత్రమే.. రేలంగి మాత్రం కాదు అని చెప్పాడు.అలా ఎందుకు సార్ అని అనగానే సెట్లో మీ గురువుగారు నన్ను తిడుతున్నారో నిన్ను తిడుతున్నారో తెలియదు అయ్యా.. అందుకే నీ పేరు ఉత్త నరసింహారావు అంటూ రేలంగి వెంకట రామయ్య గారు చెప్పిన మాటలను గుర్తు చేసుకున్నారు.

అదేవిధంగా చిన్నప్పుడు ఆరో తరగతిలో చదివేటప్పుడు మీరు ఎవరితో గొడవ పడ్డారంటగా అని అడగగానే ఎవరో కాదు మన కోడి రామకృష్ణ గారి అంటూ వారిద్దరి మధ్య ఉన్న స్నేహం గురించి తెలిపారు. అదేవిధంగా నరసింహారావు గారు మొదట్లో దాసరి నారాయణరావు గారి దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేసేవారు. ఈ క్రమంలోనే దాసరి, నరసింహారావు మధ్య జరిగిన ఓ సంఘటనను ఈ సందర్భంగా బయటపెట్టారు.

ఈ క్రమంలోనే అలీ రేలంగి నరసింహారావును ఉద్దేశించి మీరు అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేసినప్పుడు క్లాప్ బోర్డ్ కింద పెట్టి ఏదో పని చేసుకుంటూ ఉండగా మిమ్మల్ని ఒక డైరెక్టర్ కొట్టారని విన్నాము ఆ డైరెక్టర్ ఎవరు అని అడగగా… అందుకు నరసింహారావు స్పందిస్తూ క్లాప్ బోర్డు కింద పెట్టి ఏదో రాస్తూ కూర్చున్నాను. కింద చూస్తే కాళ్లు.. పైకి చూస్తే గురువుగారు (దాసరి) లాగి చెంప పై ఒకటి కొట్టారని ఈ సందర్భంగా తెలిపారు. ఇలా వీరి మధ్య ఎన్నో ఆసక్తికరమైన సంఘటనలకు సంబంధించిన ఈ ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఆ హీరో మీదకి చెప్పు విసిరారంటున్న సుధా చంద్రన్!

ప్రతి వారం ఈటీవీలో ప్రసారం అయ్యే “అలీతో సరదాగా” కార్యక్రమానికి సినీ సెలబ్రిటీస్ వచ్చి ఎన్నో విషయాలను గురించి తన అభిమానులతో పంచుకుంటారు. ఇందులో భాగంగానే ప్రముఖ క్లాసికల్ డాన్సర్ సుధా చంద్రన్ ఈ కార్యక్రమంలో పాల్గొని ఎన్నో విషయాలను సరదాగా అభిమానులతో పంచుకున్నారు. 1985వ సంవత్సరంలో సుధా చంద్రన్ జీవితం ఆధారంగా తెరకెక్కిన మయూరి చిత్రం ఏ విధంగా ప్రజలను ఆకట్టుకుంది అందరికీ తెలిసిందే.

ఈ చిత్రంలో కథానాయికగా సుధా చంద్రనే నటించగా కీలక పాత్రలో శుభాకర్‌‌ నటించాడు. ఇంకా ఈ సినిమాలో సుభా చంద్రన్ తన నటన ద్వారా ఎంతో మందిని ఆకట్టుకున్నారు. ఈ సినిమా ఎంతటి విజయాన్ని సాధించింది అంటే సినిమా విడుదలై 30 సంవత్సరాలు అవుతున్న సుధా చంద్రన్ ను చూడగానే మీరు మయూరి కదా అనేంతగా ప్రేక్షకుల మదిలో నిలిచిపోయింది. ప్రస్తుతం సుధా చంద్రన్ బుల్లితెర టీవీ షోలలో నటిస్తున్న సంగతి మనకు తెలిసిందే. అయితే సుధా చంద్రన్ “ఆలీతో సరదాగా” షోలో పాల్గొని ఆమె జీవిత విశేషాలు ఈ కార్యక్రమం ద్వారా తెలియజేశారు.

ఇండస్ట్రీలోకి రాకముందు నేను ఐఏఎస్ లేదా ఐఎఫ్‌ఎస్‌ అవుతే చూడాలని మా అమ్మ భావించింది. అనుకోకుండా నటిగా వెండితెరకు పరిచయం అయ్యానని సుధా చంద్రన్ తెలిపారు. ఇప్పుడు ఎంతోమంది బయోపిక్ చిత్రాలను మనం చూస్తున్నాం. కానీ 1985 సంవత్సరంలో మొట్టమొదటి బయోపిక్ చిత్రం “మయూరి” చిత్రాన్ని రామోజీరావు నిర్మించారని ఆమె తెలిపారు. ఈ సినిమా మంచి విజయం సాధించడంతో సుధా చంద్రన్ కంటే నన్ను మయూరిగానే ఎంతోమంది గుర్తు పడుతుంటారని తెలియజేశారు.

ఒకరోజు గుంటూరు ఫంక్షన్ లో పాల్గొనడానికి నేను, ఈ సినిమాలో హీరోగా నటించిన శుభాకర్‌‌ ఆ పంక్షన్ కు వెళ్ళాము. అక్కడ స్టేజ్ పై మేము ఉన్నప్పుడు కింద నుంచి ఎవరో శుభాకర్‌ పై చెప్పు విసిరారు. అంతేకాకుండా “మీరే కదా మయూరిని బాధపెట్టిన హీరో” అంటూ అతనిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. నేను సినిమాలలో మాత్రమే నటించానని, నిజ జీవితంలో ఆ వ్యక్తిని నేను కాదని చెప్పినప్పటికీ ప్రేక్షకులు అతని మాటలు నమ్మలేదు. ఎందుకంటే వాళ్ళు మయూరిని అంతలా ఇష్టపడ్డారని సుధా చంద్రన్ తెలిపారు. అంతేకాకుండా ఆమెకు యాక్సిడెంట్ అయిన సన్నివేశాలు, తన తల్లి మరణం? తన జీవిత భాగస్వామిని ఎలా కలుసుకున్నారనే విషయాలను గురించి తెలుసుకోవాలంటే ఈ నెల 28న ప్రసారం కాబోయే “ఆలీతో సరదాగా” కార్యక్రమాన్ని చూడాల్సిందే.