ప్రతి వారం ఈటీవీలో ప్రసారం అయ్యే “అలీతో సరదాగా” కార్యక్రమానికి సినీ సెలబ్రిటీస్ వచ్చి ఎన్నో విషయాలను గురించి తన అభిమానులతో పంచుకుంటారు. ఇందులో భాగంగానే ప్రముఖ క్లాసికల్ డాన్సర్ సుధా చంద్రన్ ఈ కార్యక్రమంలో పాల్గొని ఎన్నో విషయాలను సరదాగా అభిమానులతో పంచుకున్నారు. 1985వ సంవత్సరంలో సుధా చంద్రన్ జీవితం ఆధారంగా తెరకెక్కిన మయూరి చిత్రం ఏ విధంగా ప్రజలను ఆకట్టుకుంది అందరికీ తెలిసిందే.
ఈ చిత్రంలో కథానాయికగా సుధా చంద్రనే నటించగా కీలక పాత్రలో శుభాకర్ నటించాడు. ఇంకా ఈ సినిమాలో సుభా చంద్రన్ తన నటన ద్వారా ఎంతో మందిని ఆకట్టుకున్నారు. ఈ సినిమా ఎంతటి విజయాన్ని సాధించింది అంటే సినిమా విడుదలై 30 సంవత్సరాలు అవుతున్న సుధా చంద్రన్ ను చూడగానే మీరు మయూరి కదా అనేంతగా ప్రేక్షకుల మదిలో నిలిచిపోయింది. ప్రస్తుతం సుధా చంద్రన్ బుల్లితెర టీవీ షోలలో నటిస్తున్న సంగతి మనకు తెలిసిందే. అయితే సుధా చంద్రన్ “ఆలీతో సరదాగా” షోలో పాల్గొని ఆమె జీవిత విశేషాలు ఈ కార్యక్రమం ద్వారా తెలియజేశారు.
ఇండస్ట్రీలోకి రాకముందు నేను ఐఏఎస్ లేదా ఐఎఫ్‌ఎస్ అవుతే చూడాలని మా అమ్మ భావించింది. అనుకోకుండా నటిగా వెండితెరకు పరిచయం అయ్యానని సుధా చంద్రన్ తెలిపారు. ఇప్పుడు ఎంతోమంది బయోపిక్ చిత్రాలను మనం చూస్తున్నాం. కానీ 1985 సంవత్సరంలో మొట్టమొదటి బయోపిక్ చిత్రం “మయూరి” చిత్రాన్ని రామోజీరావు నిర్మించారని ఆమె తెలిపారు. ఈ సినిమా మంచి విజయం సాధించడంతో సుధా చంద్రన్ కంటే నన్ను మయూరిగానే ఎంతోమంది గుర్తు పడుతుంటారని తెలియజేశారు.
ఒకరోజు గుంటూరు ఫంక్షన్ లో పాల్గొనడానికి నేను, ఈ సినిమాలో హీరోగా నటించిన శుభాకర్ ఆ పంక్షన్ కు వెళ్ళాము. అక్కడ స్టేజ్ పై మేము ఉన్నప్పుడు కింద నుంచి ఎవరో శుభాకర్ పై చెప్పు విసిరారు. అంతేకాకుండా “మీరే కదా మయూరిని బాధపెట్టిన హీరో” అంటూ అతనిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. నేను సినిమాలలో మాత్రమే నటించానని, నిజ జీవితంలో ఆ వ్యక్తిని నేను కాదని చెప్పినప్పటికీ ప్రేక్షకులు అతని మాటలు నమ్మలేదు. ఎందుకంటే వాళ్ళు మయూరిని అంతలా ఇష్టపడ్డారని సుధా చంద్రన్ తెలిపారు. అంతేకాకుండా ఆమెకు యాక్సిడెంట్ అయిన సన్నివేశాలు, తన తల్లి మరణం? తన జీవిత భాగస్వామిని ఎలా కలుసుకున్నారనే విషయాలను గురించి తెలుసుకోవాలంటే ఈ నెల 28న ప్రసారం కాబోయే “ఆలీతో సరదాగా” కార్యక్రమాన్ని చూడాల్సిందే.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…