నయనతార అంటే లేడీ ఓరియెంటెడ్ సినిమాలకు ఒక బ్రాండ్ అని చెప్పవచ్చు. ఈ మధ్యకాలంలో లేడి ఓరియెంటెడ్ సినిమాల్లో ఎక్కువగా నటిస్తూ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్నారు. ఇటు తెలుగు, తమిళ, మలయాళ సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్న నయనతార తన ప్రేమ విషయంలో ఎన్నోసార్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. నయనతార ప్రస్తుతం తమిళ నటుడు విగ్నేష్ శివన్ తో ప్రేమలో ఉన్న సంగతి మనకు తెలిసిందే. తమిళనాడులో వీరిద్దరూ కలిసి ఒకే ఇంట్లో సహజీవనం చేస్తున్నారనే ప్రచారం కూడా సాగింది.అంతే కాకుండా వీరిద్దరు ఒకే ఇంట్లో కలిసి ఉన్న ఫోటోలు కూడా సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యాయి.
అయితే ప్రస్తుతం నయనతార తమిళ, మలయాళ చిత్రాలలో భాగంగా హైదరాబాద్ లో రామోజీ ఫిలిం సిటీ లో షూటింగ్ జరుపుకుంటున్నారు. కొద్ది రోజుల పాటు షూటింగ్ ఇక్కడే ఉండటంతో నయనతార రామోజీ ఫిలిం సిటీలోనే ఉంటున్నారు. అయితే తన ప్రియుడు విగ్నేష్ శివన్ కూడా రామోజీ ఫిలిం సిటీలో ఉన్నప్పటికీ తన ప్రియుడుకు నయనతార దూరంగా ఉంటున్నారు. ఇలా ఇద్దరూ ఒకే చోట ఉన్న దూరంగా ఉండటానికి గల కారణం ఏమిటంటే ప్రస్తుతం నయనతార, రజనీకాంత్ హీరోగా తెరకెక్కుతున్న ‘అన్నత్తే’ సినిమా షూటింగ్ లో పాల్గొంటున్నారు.
అలాగే విగ్నేష్ శివన్ రామోజీ ఫిలిం సిటీలో విజయ్ సేతుపతి, సమంత జంటగా ఓ సినిమాను తెరకెక్కిస్తున్నారు.ఈ విధంగా రెండు చిత్రాల షూటింగ్ పనులు ప్రస్తుతం రామోజీ ఫిలింసిటీలోనే జరుగుతుండడంతో ఒక సినిమాకు సంబంధించిన బృందం, మరొక సినిమా టీంతో మాట్లాడకూడదననే షరతు ఉండటం వల్ల వీరిద్దరి మధ్య దూరం పెరిగిపోయింది. ఈ విధంగా తన ప్రియుడు విగ్నేష్ శివన్ పక్కనే ఉన్నా కూడా నయనతార డైరెక్ట్ గా మాట్లాడే పరిస్థితిలో లేదని చెప్పవచ్చు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…