కరోనా ఈ ప్రపంచం మొత్తం వ్యాపించడంతో అన్ని దేశాల ప్రభుత్వాలు లాక్ డౌన్ అమలు చేశాయి. దీంతో అన్ని ప్రైవేటు రంగాలు మూతపడడంతో ఎంతోమంది నిరుద్యోగులుగా మారిపోయారు. లాక్ డౌన్ సమయంలో ఇంటికి పరిమితం కావడంతో ఎన్నో ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొన్నారు. కరోనా వ్యాపించి అందరికీ ఎన్నో కష్టాలను తెచ్చిందని చాలామంది భావిస్తుంటారు. కానీ ఈ కరోనా కొందరికి మాత్రం ఎంతో మేలు చేసిందని చెప్పవచ్చు. ఇలాంటి కోవకు చెందిన వ్యక్తి నవనీత్ సజీవన్‌కు.
కేరళలోని కసర్‌గాడ్‌కు చెందిన నవనీత్ సజీవన్ గత నాలుగేళ్లుగా అబుదాబిలో ఉంటున్నాడు.కరోనా వ్యాపించడంతో ఉన్నఫలంగా అతని ఉద్యోగం ద్వారా వచ్చే వేతనంతో ఎన్నో ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొన్నాడు. ఉద్యోగుల సంఖ్య క్రమంగా తగ్గిస్తూ వస్తున్న ఆ కంపెనీ అతడిని నోటీసు పీరియడ్ కింద పని చేయించుకుంటూ ఉంది.చాలీచాలని జీతంతో ఎన్నో బాధలు అనుభవిస్తున్న నవనీత్ తన జీతంలో కొంత డబ్బుతో లాటరీ టికెట్ కొన్నాడు.
లాటరీ టికెట్ కొంటూ తనకు అదృష్టం కొంచమైనా ఉందో లేదో అని భావించి లాటరీ టికెట్లు కొనుగోలు చేశాడు.ఆదివారం దుబాయి డ్యూటీ ప్రీ మిలీనియం మిలియనీర్ డ్రా నిర్వాహకులు నవనీత్‌కు ఫోన్ చేసి లాటరీ టికెట్ ద్వారా 7.4 కోట్ల రూపాయల ప్రైజ్ మనీ గెలుచుకున్నారని చెప్పడంతో ఎంతో ఆశ్చర్యానికి గురయ్యారు. నవంబర్ 22న ఆన్లైన్ ద్వారా లాటరీ టికెట్ కొన్న నవనీత్ లాటరీ గెలవడంతో తన కష్టాలన్నీ తీరిపోయాయని ఎంతో సంబరపడ్డాడు. తన గెలుచుకున్న ప్రైజ్ మనీతో తన కుటుంబ అవసరాలను తీర్చడంతో పాటు తన స్నేహితులకు, సహోద్యోగుల అవసరాలకు కొంత డబ్బును వినియోగిస్తున్నట్లు నవనీత్ సజీవన్ తెలిపారు. లాటరీ ద్వారా ఒకే సారి ఇంత మొత్తంలో డబ్బులు గెలవటం ఎంతో ఆనందంగా ఉందని తెలిపారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…