బిగ్ బాస్ సీజన్ ఫోర్ మొదలైన మొదట్లో అభిజిత్,మోనాల్,అఖిల్ మధ్య లవ్ ట్రయాంగిల్ నడుస్తుందని అందరూ భావించారు.ప్రతిరోజు గంటసేపు ప్రసారమయ్యే ఈ షోలో బిగ్ బాస్ ఎక్కువసేపు స్క్రీన్ పై చూపించడం పసిగట్టిన అభిజిత్ మెల్లి మెల్లిగా మోనాల్ ను పక్కన పెడుతూ వచ్చాడు. అభిజిత్ తప్పుకోవడంతో బిగ్ బాస్ అఖిల్,మోనాల్ ను హైలెట్ చేసి చూపించడంతో వారిద్దరి మధ్య ప్రేమ ప్రయాణం సాగుతుందని ప్రేక్షకులు అందరూ భావించారు.
అభిజిత్ కొద్దిరోజుల తర్వాత హారికతో ఎంతో చనువుగా ఉండటంతో వీరిద్దరి మధ్య ప్రేమ చిగురించిందని భావించారు. అందుకు తగ్గట్టుగానే ఇంట్లో అభిజిత్, హారికతో ఎక్కువ సేపు కబుర్లు చెబుతుండడం, హగ్స్ ఇలాంటి వాటిని బిగ్ బాస్ హైలెట్ చేసి చూపించడంతో వీరిద్దరి మధ్య ఏదో నడుస్తుందని పుకార్లు పుట్టాయి. వీరిద్దరి మధ్య జరిగిన రొమాంటిక్ సీన్లను బిగ్ బాస్ చూపించడంతో ఏకంగా ప్రేక్షకులు వీరిద్దరిని “అభిక” అని పిలవడం మొదలుపెట్టారు.
ఒక సందర్భంలో అభిజిత్ తల్లి హారిక లాంటి కోడలు కావాలని చెప్పడం, హారిక ఎలాంటి నిర్ణయం తీసుకున్నా మాకి ఓకే అని హారిక తల్లి చెప్పడంతో ప్రేక్షకులందరూ వీరు లవ్ లో ఉన్నారని భావించారు. కానీ అందరి అభిప్రాయాలు చాలా తప్పని బిగ్ బాస్ విజేతగా గెలిచి, ఒక టీవీ చానల్ కు ఇంటర్వ్యూ ఇచ్చిన అభిజిత్ బిగ్ బాస్ మా రిలేషన్ ను చాలా తప్పుగా చూపించాడని హారిక నాకు చెల్లెలు లాంటిదని షాకింగ్ కామెంట్స్ చేశారు.
అంతేకాకుండా అభిజిత్ మాట్లాడుతూ.. నాకు ఒక తమ్ముడు ఉన్నాడని, హారిక లాంటి చెల్లెలు కూడా ఉంటే ఎంతో బాగుండేదని ఈ విషయం హారికతో ఎన్నో సార్లు చెప్పానని కూడా తెలియజేశారు. అయితే ఈ విషయం బయటకు రాలేదని ఇప్పుడే తెలిసిందని అభిజిత్ పేర్కొన్నాడు. అభిజిత్ ఒక్కసారిగా హారిక తన చెల్లెలు అని చెప్పడంతో ఎంతోమంది అభిమానులు తీవ్ర నిరుత్సాహానికి గురయ్యారు.
మరోవైపు హారిక సైతం మేము ఇద్దరం అన్న చెల్లెల్లానే బిహేవ్ చేశాం. ఎప్పుడు కూడా అలా లేదు… కానీ బిగ్ బాస్ సీజన్ 4 ఎపిసోడ్స్ లో అలా ప్రసారం అయ్యింది అంటూ చెప్పుకొచ్చింది హారిక. మేము షోలో ఉన్నప్పుడు కూడా ఎన్నో సార్లు బ్రదర్, సిస్టర్ లానే ఉన్నాం.. ఎన్నో సార్లు బ్రదర్ అని కూడా పిలిచాం… కానీ అవి చూపించలేదు అంటూ చెప్పుకొచ్చింది హారిక.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…