కరోనా సమయంలో లాక్ డౌన్ కారణంగా చిత్ర నిర్మాణ పనులు ఆగిపోవడంతో ప్రముఖ సినీ సెలబ్రిటీస్ మొత్తం ఇంటికే పరిమితమయ్యారు.అయితే ఇంటికే పరిమితమైన హీరోలందరూ ఛాలెంజ్ లో భాగంగా రోజు ఇంటి పనులను చేస్తూ తమ చాలెంజ్ పూర్తి చేసేవారు. ఈ చాలెంజ్ లో భాగంగానే మెగాస్టార్ చిరంజీవి తన ఇంటిని శుభ్రం చేస్తూ, అలాగే దోసెలను వేస్తూ తన చాలెంజ్ పూర్తి చేసిన సంగతి మనకు తెలిసిందే.
తాజాగా మెగాస్టార్ చిరంజీవి సమంత వ్యాఖ్యాతగా “ఆహా” యాప్ ద్వారా నిర్వహిస్తున్న సామ్ జామ్ అనే టాక్ షో కి మెగాస్టార్ చిరంజీవి వస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే పలువురు సినీ సెలబ్రిటీలు పాల్గొని సందడి చేశారు. అయితే క్రిస్మస్ కానుకగా మెగాస్టార్ చిరంజీవి తనదైన శైలిలో సందడి చేయనున్నారు. తాజాగా ఇందుకు సంబంధించిన ఒక ప్రోమోను విడుదల చేశారు.
ఈ వీడియోలో సమంత అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెబుతూ ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. సమంత చిరంజీవిని “మీరు ఎప్పుడైనా సినిమా చూస్తూ ఏడ్చారా”? అనే ప్రశ్నను అడగడంతో అందుకు చిరంజీవి గారు సమాధానం చెబుతూ… ఓ సినిమాకు వెళ్లి కన్నీళ్ళు పెట్టుకున్నానని, కిందకు వంగి కళ్ళు తుడుచుకుంటున్న సమయంలో లైట్లు వేశారు తాను పైకి లేచేసరికి పైట చేతిలో ఉందని నవ్వుతూ చెప్పారు. అంతేకాకుండా ఈ షోలో చేతులు లేని బాలుడు ఎంతో అద్భుతంగా చిరంజీవి బొమ్మను నోటితో గీయడంతో ఎంతో ఆనంద పడ్డారు.
అంతే కాకుండా సమంత కరోనా సమయంలో దోస చాలెంజ్ ను గుర్తు చేస్తూ ఇప్పుడు కూడా చిరంజీవిగారితో దోసెలను వేయించారు. అయితే ఈసారి మాత్రం చిరంజీవిగారు కళ్ళకు గంతలు కట్టుకొని దోసే వేయడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.ఇందుకు సంబంధించిన ప్రోమో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారి అందరిని ఆకట్టుకుంది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…