Tag Archives: aliabhatt

Niharika Konidela: గంగుబాయ్ గెటప్ లో తలుక్కుమన్న మెగా డాటర్.. వైరల్ అవుతున్న వీడియో!

Niharika Konidela: మెగా డాటర్ నిహారిక గురించి అందరికీ సుపరిచితమే.నాగబాబు కుమార్తెగా ఇండస్ట్రీలోకి బుల్లితెర యాంకర్ గా ఎంట్రీ ఇచ్చిన ఈమె అనంతరం పలు సినిమాలలో హీరోయిన్ గా నటించినప్పటికీ పెద్దగా తనకు గుర్తింపు రాలేదు. ఇలా ఇండస్ట్రీలో కొనసాగుతూనే ఈమె వివాహం చేసుకున్నారు.వివాహం జరిగినప్పటికీ సినిమాపై ఉన్న ఫ్యాషన్ తో ఈమె సినిమాలలో నటించకపోయిన వెబ్ సిరీస్ లను నిర్మిస్తూ నిర్మాతగా మారిపోయారు.

ఈ విధంగా నిహారిక వెబ్ సిరీస్ లకు నిర్మాతగా ఇప్పటికే రెండు వెబ్ సిరీస్ లను నిర్మించి ఎంతో మంచి గుర్తింపు పొందారు.కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉండే ఈమె సోషల్ మీడియాలో కూడా ఎంతో యాక్టివ్ గా ఉంటారు.ఈ క్రమంలోనే తనకు సంబంధించిన ప్రతి విషయాన్ని సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంటారు.

ఇకపోతే నిహారిక ఇంస్టాగ్రామ్ ద్వారా ఒక వీడియోని షేర్ చేశారు. అయితే ఈమె ఒక పార్టీలో సందడి చేసినట్టు తెలుస్తుంది. ఈ పార్టీలో ఈమె ఎంతో స్పెషల్ అట్రాక్షన్ గా గంగుబాయ్ గెటప్ లో సందడి చేశారు.తెలుపు రంగు చీర కట్టుకొని ఎర్రటి లిప్ స్టిక్ పెద్దగా తిలకం చేతిలో హ్యాండ్ బ్యాగ్ పట్టుకొని అచ్చం గంగుబాయ్ సినిమాలు అలియా భట్ కూడా కుళ్ళుకొనేలా ఈమె ఈ గెటప్ లో సందడి చేశారు.

Niharika Konidela: గంగు భాయ్ ను తలపించిన నిహారిక…

ఈ క్రమంలోనే ఈ వీడియోని ఇంస్టాగ్రామ్ ద్వారా షేర్ చేస్తూ…..గంగూని ఛానెలింగ్‌ చేస్తుంది. మీకు తెలుసో, తెలియదో, నేను ఇలాంటి కాస్ట్యూమ్స్‌ పార్టీలను ఇష్టపడతానని తెలిపింది. ఇక ఈ వీడియోలో ఇద్దరి యువకులు తనని ఆట పట్టిస్తుంటారు వారిని ఉద్దేశించి ఆ ఇద్దరి కోతుల్ని ఏమాత్రం పట్టించుకోకండి అంటూ ఈమె షేర్ చేసిన ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.ఇక ఈ వీడియో పై ఎంతో మంది పెద్ద ఎత్తున కామెంట్లు చేస్తూ ప్రశంసలు కురిపించగా అల్లు అర్జున్ సతీమణి అల్లు స్నేహ సూపర్ అంటూ కామెంట్ చేశారు.

వామ్మో.. అలియా భట్ ఖర్చు.. ఆర్ఆర్ఆర్ నిర్మాతకు దెబ్బ!

బాలీవుడ్ భామ అలియా భట్ ప్రత్యేకమైన పాత్రలో నటించి మంచి గుర్తింపును సంపాదించుకున్నారు. విభిన్న పాత్రలలో నటించి అందరిని ఆకట్టుకున్న అలియా, ప్రస్తుతం తెలుగులో దర్శకధీరుడు ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ఆర్.ఆర్. ఆర్ చిత్రాన్ని తెరకెక్కిస్తున్న విషయం మనకు తెలిసినదే. ఈ సినిమాలో ప్రముఖ హీరోలయిన రామ్ చరణ్ తేజ్, ఎన్టీఆర్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.

ఇప్పటికే ఈ చిత్ర నిర్మాణం పూర్తి చేసుకొని విడుదల కావాల్సి ఉండగా కరోనా కారణం వల్ల వేసవి సెలవులలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాలో రామ్ చరన్ అల్లూరి సీతారామరాజు పాత్రలో, ఎన్టీఆర్ కొమరం భీమ్ పాత్రలో నటిస్తున్నారు. ఇప్పటికే వీరిద్దరి పాత్రల పై టీజర్ లు విడుదలయ్యాయి. ఈ టీజర్స్ కి మంచి వ్యూస్ రావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలను పెట్టుకున్నారు దర్శక నిర్మాతలు.

అయితే ఈ సినిమాలో అల్లు సీతారామరాజు పాత్రలో, రామ్ చరణ్ సరసన సీత పాత్రలో బాలీవుడ్ ప్రముఖ నటి అలియా భట్ నటించనున్నారు. తాజాగా రామ్ చరణ్, అలియా పై దర్శకుడు కొన్ని కీలకమైన సన్నివేశాలను చిత్రీకరించనున్నారట. ముందుగా ఓ పాట చిత్రీకరణ జరుగుతుందని సమాచారం. చారిత్రాత్మక నేపథ్యంలో రూపొందుతున్న ఈ చిత్రంలో బాలీవుడ్ నటుడు అజయ్ దేవగన్ కీలక పాత్ర పోషించనున్నాడు. ఈ చిత్రం షూటింగ్లో భాగంగా అలియా ఈ చిత్ర బృందం కలిసిపోయింది.

అయితే అలియా భట్ తనతో పాటు పదిమంది పర్సనల్ స్టాప్ ను కూడా వెంట తీసుకొచ్చారు. అయితే వీరందరి ఖర్చులు కూడా చిత్ర నిర్మాత భరించాల్సి ఉంటుంది.అలియా స్టాప్ మొత్తానికి కలిపి రోజుకు దాదాపు లక్ష రూపాయల వరకు ఖర్చు చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుండడంతో నిర్మాతకు బాగానే ఖర్చవుతుందని తెలుస్తుంది. బాలీవుడ్ టాప్ హీరోయిన్లలో ఒకరైన అలియాభట్ కోసం చేసేదేమీ లేక నిర్మాత పెద్ద మొత్తంలోనే ఖర్చు చేస్తున్నాడని తెలుస్తోంది.

రోజుకు ఎక్కువ మొత్తంలో ఖర్చు అవుతుండడంతో, అలియా పై ఉన్న సన్నివేశాలను తొందరగా చిత్రీకరణ పూర్తి చేస్తున్నారు దర్శకుడు. అయితే ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించే ఈ చిత్రం కోసం నిర్మాత డివివి దానయ్య సుమారు 400 కోట్ల రూపాయల బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నట్లు తెలుస్తోంది.