Tag Archives: allurisitaramaraju

NTR -Krishan: ఎంతో స్నేహంగా ఉన్న ఎన్టీఆర్ కు కృష్ణకు మధ్య మనస్పర్ధలు ఎందుకు వచ్చాయో తెలుసా?

NTR -Krishan: తెలుగు చిత్ర పరిశ్రమలు సూపర్ స్టార్ కృష్ణ ఎన్టీఆర్ ఏఎన్ఆర్ వంటి అగ్ర హీరోలు అందరూ తెలుగు చిత్ర పరిశ్రమకు మూల స్తంభాలుగా నిలబడ్డారు. ఇలా ఈ హీరోలందరూ ఎలాంటి పాత్రలలోనైనా ఎంతో అవలీలగా నటిస్తూ తెలుగు చిత్ర పరిశ్రమకు ఎంతో గర్వకారణంగా నిలిచారు. ఇకపోతే ఎన్టీఆర్ ను ప్రేరణగా తీసుకొని కృష్ణ సినిమాలలోకి వచ్చారు. ఈ క్రమంలోనే వీరిద్దరి మధ్య అన్నదమ్ముల అనుబంధం ఏర్పడింది. ఇలా అన్నదమ్ములుగా ఎంతో కలిసిమెలిసి ఉన్నటువంటి వీరిద్దరి మధ్య పచ్చగడ్డి వేసిన భగ్గుమనేలా మనస్పర్ధలు వచ్చాయి.

ఇలా వీరిద్దరి మధ్య మనస్పర్ధలు రావడానికి ఎన్నో కారణాలు ఉన్నాయి. ముఖ్యంగా అల్లూరి సీతారామరాజు సినిమా విషయంలో వీరిద్దరి మధ్య మనస్పర్ధలు వచ్చాయని తెలుస్తోంది.అల్లూరి సీతారామరాజు సినిమాని ఎన్టీఆర్ చేయాలని భావించారు. అయితే ఊహించని విధంగా ఈ సినిమాని కృష్ణ ప్రకటించి ఈ సినిమాలో నటించారు ఇలా ఈ సినిమాలో కృష్ణ నటించిన కృష్ణ మధ్య విభేదాలు తలెత్తాయి.

ఈ సినిమా అనంతరం ఎన్టీఆర్ దానవీరశూరకర్ణ సినిమా ప్రకటించగా ఆయనకు పోటీగా కృష్ణ కురుక్షేత్రం సినిమా చేయడంతో ఈ సినిమా సమయంలో కూడా వీరి మధ్య మనస్పర్ధలు వచ్చాయి.ఇక వీరిద్దరూ తమ వారసులని ఇండస్ట్రీకి పరిచయం చేస్తే సినిమాలను ప్రకటించారు అయితే ఈ రెండు సినిమాలకు ఒకే విధమైనటువంటి టైటిల్ ఉండడంతో ఈ సినిమా టైటిల్ విషయంలో కూడా గొడవ జరగడం కోర్టు వరకు వెళ్లడం జరిగింది. ఈ విధంగా వీరిద్దరి మధ్య పలు విషయాలలో భేదాభిప్రాయాలు వచ్చి మనస్పర్ధలు రావడంతో ఇద్దరికీ మాటలు లేవు అయితే వీరి మధ్య ఎలాంటి వివాదం వచ్చినా అది కేవలం కొన్ని రోజులు మాత్రమే ఉండేది.

NTR -Krishan: సినిమాల విషయంలోనే మనస్పర్ధలు..

ఇకపోతే సినిమా ఇండస్ట్రీలో పేరు ప్రఖ్యాతలు పొందిన అనంతరం ఎన్టీఆర్ రాజకీయాలలోకి వచ్చారు. రాజకీయాలలోకి వచ్చిన ఎన్టీఆర్ కి కృష్ణ పూర్తి మద్దతు తెలిపారు. అయితే అనూహ్యంగా రాజీవ్ గాంధీ పిలుపుమేరకు కృష్ణ కూడా కాంగ్రెస్ పార్టీ తరఫున రాజకీయాలలోకి రావడంతో వీరిద్దరి మధ్య మరోసారి మనస్పర్ధలు వచ్చాయి. రాజీవ్ గాంధీ మరణం తర్వాత కృష్ణ రాజకీయాలకు దూరమయ్యారు తద్వారా తిరిగి వీరిద్దరి మధ్య మరోసారి మంచి స్నేహం ఏర్పడింది. ఇలా ఎంతో చనువుగా ఉన్నటువంటి వీరిద్దరి మధ్య పలు విషయాలలో మనస్పర్ధలు చోటుచేసుకున్నాయి.