Tag Archives: anchra pradesh

ఏపీ హైకోర్టులో జాబ్ లు.. దరఖాస్తుకు రెండు రోజులే గడువు..

ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయింది. ఈ నోటిఫికేషన్ ద్వారా 174 పోస్టులను భర్తీ చేయనున్నారు. అర్హత, ఆసక్తిగల అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. దానికి సంబంధించి ఆన్ లైన్ దరఖాస్తు ప్రక్రియ 2021 సెప్టెంబర్ 9 నుంచి మొదలు కాగా.. చివరి తేదీగా సెప్టెంబర్ 30, 2021 గా నిర్ణయించారు.

అంటే దరఖాస్తుకు కేవలం రెండు రోజులు మాత్రమే ఉంది. అభ్యర్థులు పూర్తి వివరాలకు https://hc.ap.nic.in/ వెబ్‌సైట్ చూసి.. నోటిఫికేషన్ లో పేర్కొన్న విధంగా దరఖాస్తులను నిపాలని సూచించారు. అందులో ముఖ్యంగా 71 అసిస్టెంట్ పోస్టులు ఉండగా.. 29 పోస్టులు ఎగ్జామినర్, 35 పోస్టులు టైపిస్టు, 39 పోస్టులు కాపీయిస్ట్ ఉన్నట్లు తెలిపారు.

దీనికి అర్హతగా ఏదైనా యూనివర్సిటీలో డిగ్రీ పూర్తి చేయాలని పేర్కొన్నారు. కాపీయిస్ట్, టైపిస్ట్ పోస్టులకు డిగ్రీతో పాటు టైప్‌రైటింగ్ (ఇంగ్లీష్) హయ్యర్ గ్రేడ్‌లో ప్రభుత్వ టెక్నికల్ ఎగ్జామ్ పాస్ కావాలి. నిమిషానికి 45 పదాలు టైప్ చేయగలగాలి. 18 నుంచి 42 ఏళ్ల మద్య వయస్సుగల అభ్యర్థలు దరఖాస్తు చేసుకోవచ్చాన్నారు. కంప్యూటర్‌ బేస్డ్‌ ఆబ్జెక్టివ్‌ తరహా పరీక్ష ఆధారంగా ఎంపికచేయనున్నారు. దీనికి వేతనంగా

జనరల్‌ నాలెడ్జ్, ఇంగ్లిష్‌ లాంగ్వేజ్, రీజనింగ్‌ విభాగాల నుంచి ప్రశ్నలు ఉంటాయని.. ఆసక్తి గల అభ్యర్థలు దరఖాస్తు చేసుకోవాలని నోటిఫికేషన్ లో పేర్కొన్నారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలకు https://hc.ap.nic.in/ ను సందర్శించి అందులో నోటిఫికేషన్ డౌన్ లోడ్ చేసుకొని దరఖాస్తులను కేవలం ఆన్ లైన్ మోడ్ లో మాత్రమే పంపాలని పేర్కొన్నారు.

దొంగలుగా మారిన పోలీసులు.. సీసీటీవీ ఫుటేజ్‌ వీడియో వైరల్..

దొంగలను పట్టుకొని వాళ్లకు బుద్ది చెప్పాల్సిన పోలీసులే దొంగలుగా మారి దోచుకుంటున్నారు. ఈ ఘటన ఆంధ్రప్రదేశ్ లోని చిత్తూరు జిల్లాలో చోటు చేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. చిత్తూరు లోని కలెక్టరేట్ కు వెళ్లే దారిలో రోడ్డు పక్కన రెండు బట్టల దుకాణాలున్నాయి. రోజంతా వ్యాపారం చేసి రాత్రిళ్లు బట్టలన్నీ మూట కట్టేస్తారు.

కొన్నిసార్లు లోపలే ఏర్పాటు చేసుకున్న మంచంలో పడుకుంటారు ఆ వ్యాపారస్తులు. మరికొన్నిసార్లు దుకాణాన్ని పట్టాలతో మూసేసి పోలీసులు పెట్రోలింగ్ చేస్తుంటారనే నమ్మకంతో ఇళ్లకు వెళ్లిపోతారు. ఇలాగే ఓ రోజు షాపు మూసేసి ఓ యజమాని ఇంటికి వెళ్లిపోయాడు. ముందే విషయం తెలుసుకున్నారో… అప్పటికప్పుడు షాపులో ఎవరూ లేని విషయాన్ని గమనించారో.. ఇద్దరు పోలీసులు షాపు బయట స్కూటర్ ఆపి లోపలికి వచ్చారు.

అందులో ఒకరు పోలీస్ యూనిఫాంలో ఉండగా.. మరొకరు సివిల్ డ్రస్ లో ఉన్నారు. అక్కడ ఉన్న బండిలోని ఓ మూట ఓపెన్ చేసి అందులో కొన్ని దుస్తులను చోరీ చేసి అక్కడ నుంచి వెళ్లిపోయారు. తెల్లారి వచ్చి తన దుకాణం తెరిచి చూశాడు ఆ బట్టల దుకాణం యజమాని. ఒక మూటలో బట్టలు తక్కువగా ఉండటాన్ని గమనించి చోరీ జరిగినట్లు గ్రహించాడు.

దీంతో తన షాప్ లోనే ఏర్పాటు చేసిన సీసీటీవీ ఫుటేజ్ ఓపెన్ చేసి చూడగా.. పోలీసులే దొంగతనం చేసినట్లు తెలిసింది. దొంగతనం జరిగిన ఆరు రోజుల తర్వాత సీసీ కెమెరా వీడియో బయటపడింది. వీడియో ఆధారంగా పోలీసులకు ఫిర్యాదు చేశాడు షాపు యజమాని. షాపులోకి వెళ్లి బట్టలు తీసుకున్నది ఏఆర్ కానిస్టేబుల్ అని.. బయట కాపలాగా సివిల్ డ్రెస్ లో ఉన్న మరో పోలీసు ఏఆర్ ఏఎస్ఐ అని తెలిసింది. ఈ విషయం తెలుసుకున్న ప్రజలు పోలీసులే ఇలాంటి పనులకు పాల్పడితే సామాన్య ప్రజలకు ఇక రక్షణ ఎలా ఉంటుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.