దొంగలను పట్టుకొని వాళ్లకు బుద్ది చెప్పాల్సిన పోలీసులే దొంగలుగా మారి దోచుకుంటున్నారు. ఈ ఘటన ఆంధ్రప్రదేశ్ లోని చిత్తూరు జిల్లాలో చోటు చేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. చిత్తూరు లోని కలెక్టరేట్ కు వెళ్లే దారిలో రోడ్డు పక్కన రెండు బట్టల దుకాణాలున్నాయి. రోజంతా వ్యాపారం చేసి రాత్రిళ్లు బట్టలన్నీ మూట కట్టేస్తారు.
కొన్నిసార్లు లోపలే ఏర్పాటు చేసుకున్న మంచంలో పడుకుంటారు ఆ వ్యాపారస్తులు. మరికొన్నిసార్లు దుకాణాన్ని పట్టాలతో మూసేసి పోలీసులు పెట్రోలింగ్ చేస్తుంటారనే నమ్మకంతో ఇళ్లకు వెళ్లిపోతారు. ఇలాగే ఓ రోజు షాపు మూసేసి ఓ యజమాని ఇంటికి వెళ్లిపోయాడు. ముందే విషయం తెలుసుకున్నారో… అప్పటికప్పుడు షాపులో ఎవరూ లేని విషయాన్ని గమనించారో.. ఇద్దరు పోలీసులు షాపు బయట స్కూటర్ ఆపి లోపలికి వచ్చారు.
అందులో ఒకరు పోలీస్ యూనిఫాంలో ఉండగా.. మరొకరు సివిల్ డ్రస్ లో ఉన్నారు. అక్కడ ఉన్న బండిలోని ఓ మూట ఓపెన్ చేసి అందులో కొన్ని దుస్తులను చోరీ చేసి అక్కడ నుంచి వెళ్లిపోయారు. తెల్లారి వచ్చి తన దుకాణం తెరిచి చూశాడు ఆ బట్టల దుకాణం యజమాని. ఒక మూటలో బట్టలు తక్కువగా ఉండటాన్ని గమనించి చోరీ జరిగినట్లు గ్రహించాడు.
దీంతో తన షాప్ లోనే ఏర్పాటు చేసిన సీసీటీవీ ఫుటేజ్ ఓపెన్ చేసి చూడగా.. పోలీసులే దొంగతనం చేసినట్లు తెలిసింది. దొంగతనం జరిగిన ఆరు రోజుల తర్వాత సీసీ కెమెరా వీడియో బయటపడింది. వీడియో ఆధారంగా పోలీసులకు ఫిర్యాదు చేశాడు షాపు యజమాని. షాపులోకి వెళ్లి బట్టలు తీసుకున్నది ఏఆర్ కానిస్టేబుల్ అని.. బయట కాపలాగా సివిల్ డ్రెస్ లో ఉన్న మరో పోలీసు ఏఆర్ ఏఎస్ఐ అని తెలిసింది. ఈ విషయం తెలుసుకున్న ప్రజలు పోలీసులే ఇలాంటి పనులకు పాల్పడితే సామాన్య ప్రజలకు ఇక రక్షణ ఎలా ఉంటుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…