ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయింది. ఈ నోటిఫికేషన్ ద్వారా 174 పోస్టులను భర్తీ చేయనున్నారు. అర్హత, ఆసక్తిగల అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. దానికి సంబంధించి ఆన్ లైన్ దరఖాస్తు ప్రక్రియ 2021 సెప్టెంబర్ 9 నుంచి మొదలు కాగా.. చివరి తేదీగా సెప్టెంబర్ 30, 2021 గా నిర్ణయించారు.
అంటే దరఖాస్తుకు కేవలం రెండు రోజులు మాత్రమే ఉంది. అభ్యర్థులు పూర్తి వివరాలకు https://hc.ap.nic.in/ వెబ్‌సైట్ చూసి.. నోటిఫికేషన్ లో పేర్కొన్న విధంగా దరఖాస్తులను నిపాలని సూచించారు. అందులో ముఖ్యంగా 71 అసిస్టెంట్ పోస్టులు ఉండగా.. 29 పోస్టులు ఎగ్జామినర్, 35 పోస్టులు టైపిస్టు, 39 పోస్టులు కాపీయిస్ట్ ఉన్నట్లు తెలిపారు.
దీనికి అర్హతగా ఏదైనా యూనివర్సిటీలో డిగ్రీ పూర్తి చేయాలని పేర్కొన్నారు. కాపీయిస్ట్, టైపిస్ట్ పోస్టులకు డిగ్రీతో పాటు టైప్‌రైటింగ్ (ఇంగ్లీష్) హయ్యర్ గ్రేడ్‌లో ప్రభుత్వ టెక్నికల్ ఎగ్జామ్ పాస్ కావాలి. నిమిషానికి 45 పదాలు టైప్ చేయగలగాలి. 18 నుంచి 42 ఏళ్ల మద్య వయస్సుగల అభ్యర్థలు దరఖాస్తు చేసుకోవచ్చాన్నారు. కంప్యూటర్ బేస్డ్ ఆబ్జెక్టివ్ తరహా పరీక్ష ఆధారంగా ఎంపికచేయనున్నారు. దీనికి వేతనంగా
జనరల్ నాలెడ్జ్, ఇంగ్లిష్ లాంగ్వేజ్, రీజనింగ్ విభాగాల నుంచి ప్రశ్నలు ఉంటాయని.. ఆసక్తి గల అభ్యర్థలు దరఖాస్తు చేసుకోవాలని నోటిఫికేషన్ లో పేర్కొన్నారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలకు https://hc.ap.nic.in/ ను సందర్శించి అందులో నోటిఫికేషన్ డౌన్ లోడ్ చేసుకొని దరఖాస్తులను కేవలం ఆన్ లైన్ మోడ్ లో మాత్రమే పంపాలని పేర్కొన్నారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…