Categories: FeaturedGeneral News

మీ కుక్క లేదా పశువులకు ఇలాంటి లక్షణాలు ఉన్నాయా.. అయితే అప్రమత్తం అవ్వండి.. లేదంటే..

సాధారణంగా చాలామంది రేబిస్ వ్యాధి అనేది వీధి కుక్కలు కరవడం వల్ల మాత్రమే వస్తుంది అనుకుంటారు.. కానీ అది నిజం కాదు.. వీధి కుక్కలతో పాటు పెంపుడు కుక్కల వల్ల కూడా రేబిస్ వ్యాధి వస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఈ వ్యాధికి మందు లేదు కేవలం నివారణ ఒక్కటే మార్గం. అయితే క్రమం తప్పకుండా పెంపుడు కుక్కలతో పాటు జంతువులకు కూడా రేబిస్ టీకా ఇప్పించాలి.

ఈ వ్యాధికారక క్రీములు శరీరంలోని నరాల్లో ప్రవేశిస్తే కాపాడటం అసాధ్యం. ఈ వ్యాధిపై అవగాహన పెంచుకుని నష్టాన్ని నివారించడమే ప్రపంచ రేబిస్‌ దినోత్సవ ముఖ్య ఉద్దేశం.. నేడు వరల్డ్‌ రెబీస్‌ డేగా జరుపుకుంటారు. ఎందుకంటే ఇదే రోజు రెబీస్‌కు వ్యతిరేకంగా మొదటిసారి వ్యాక్సిన్ ను కనిపెట్టిన ప్రముఖ శాస్త్రవేత్త లూయిస్‌ పాశ్చర్‌ కు గుర్తుగా నిర్వహిస్తారు.

రేబిస్‌ వ్యాధి సోకిన కుక్కలు మనుషులను, పశువులను, ఇతర కుక్కలను కరవడం వల్ల ఈ వ్యాధికారక క్రిములు శరీరంలోకి ప్రవేశించి వ్యాధిని కలగజేస్తాయి. అయితే ఈ వ్యాధి లక్షణాలను కుక్కల్లో ఇలా ఉంటాయి. నోటి నుంచి చొంగ కారడం..నాలుక బయటపెట్టడం, మతిలేకుండా తిరగడం, కనబడిన వస్తువులను, మనుషులను, పశువులను, ఇతర కుక్కలను కరవడం, అరుపులో మార్పు వంటివి ప్రధాన లక్షణాలు ఉంటాయి. ఇది సోకిన కుక్కు వారం రోజుల్లో చనిపోతుంది.

అది మనుషులకు కరిస్తే మాత్రం చాలా ప్రమాదకరం. పశువుల్లో అయితే.. గేదెలు, ఆవులు చొంగ కార్చడం, యజమానిని గుర్తు పట్టకపోవడం, తలను గోడకు కొట్టుకోవడం.. గట్టిగా అరవడం వంటివి చేస్తే చివరకు మేత మేయకుండా చనిపోతాయి. ఇలాంటివి కనిపిస్తే పశువుల వైద్యుడి దగ్గరకు తీసుకెళ్లడం మంచిది. కుక్క కాటకు గురైన వారికి యాంటీ రేబిస్ వ్యాక్సిన్ తీసుకోవాల్సి ఉంటుంది.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago