సాధారణంగా చాలామంది రేబిస్ వ్యాధి అనేది వీధి కుక్కలు కరవడం వల్ల మాత్రమే వస్తుంది అనుకుంటారు.. కానీ అది నిజం కాదు.. వీధి కుక్కలతో పాటు పెంపుడు కుక్కల వల్ల కూడా రేబిస్ వ్యాధి వస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఈ వ్యాధికి మందు లేదు కేవలం నివారణ ఒక్కటే మార్గం. అయితే క్రమం తప్పకుండా పెంపుడు కుక్కలతో పాటు జంతువులకు కూడా రేబిస్ టీకా ఇప్పించాలి.

ఈ వ్యాధికారక క్రీములు శరీరంలోని నరాల్లో ప్రవేశిస్తే కాపాడటం అసాధ్యం. ఈ వ్యాధిపై అవగాహన పెంచుకుని నష్టాన్ని నివారించడమే ప్రపంచ రేబిస్ దినోత్సవ ముఖ్య ఉద్దేశం.. నేడు వరల్డ్ రెబీస్ డేగా జరుపుకుంటారు. ఎందుకంటే ఇదే రోజు రెబీస్‌కు వ్యతిరేకంగా మొదటిసారి వ్యాక్సిన్ ను కనిపెట్టిన ప్రముఖ శాస్త్రవేత్త లూయిస్ పాశ్చర్ కు గుర్తుగా నిర్వహిస్తారు.
రేబిస్ వ్యాధి సోకిన కుక్కలు మనుషులను, పశువులను, ఇతర కుక్కలను కరవడం వల్ల ఈ వ్యాధికారక క్రిములు శరీరంలోకి ప్రవేశించి వ్యాధిని కలగజేస్తాయి. అయితే ఈ వ్యాధి లక్షణాలను కుక్కల్లో ఇలా ఉంటాయి. నోటి నుంచి చొంగ కారడం..నాలుక బయటపెట్టడం, మతిలేకుండా తిరగడం, కనబడిన వస్తువులను, మనుషులను, పశువులను, ఇతర కుక్కలను కరవడం, అరుపులో మార్పు వంటివి ప్రధాన లక్షణాలు ఉంటాయి. ఇది సోకిన కుక్కు వారం రోజుల్లో చనిపోతుంది.
అది మనుషులకు కరిస్తే మాత్రం చాలా ప్రమాదకరం. పశువుల్లో అయితే.. గేదెలు, ఆవులు చొంగ కార్చడం, యజమానిని గుర్తు పట్టకపోవడం, తలను గోడకు కొట్టుకోవడం.. గట్టిగా అరవడం వంటివి చేస్తే చివరకు మేత మేయకుండా చనిపోతాయి. ఇలాంటివి కనిపిస్తే పశువుల వైద్యుడి దగ్గరకు తీసుకెళ్లడం మంచిది. కుక్క కాటకు గురైన వారికి యాంటీ రేబిస్ వ్యాక్సిన్ తీసుకోవాల్సి ఉంటుంది.































