ప్రస్తుతం ప్రతీఒక్కరు రోగనిరోధక శక్తిని పెంచుకోవడంలో ఎక్కువగా శ్రద్ధ వహిస్తున్నారు. ఇలా చేయడం వల్ల దీర్ఘకాలిక వ్యాధులు ఉన్న వారికి కూడా మంచిదే. ఆ వ్యాధులను తగ్గే అవకాశం కూడా ఉంది. అయితే దానిలో భాగంగా మధుమేహ వ్యాధిగ్రస్తులు వారి డైట్ చార్ట్ ను సిద్దంచేసుకోవడంలో అత్యంత జాగ్రత్త వహించవలసి ఉంటుంది.
మధుమేహ వ్యాధిగ్రస్తులు ఎటువంటి ఆందోళనా లేకుండా అనుసరించగల ఆహారాలు కొన్ని ఉన్నాయి. వీరికి తీపి తినాలనిపించినపుడు స్వీట్‌కు ప్రత్యామ్నాయంగా ఫ్రూట్స్ తినవచ్చు. మధుమేహంతో బాధపడుతున్న రోగులకు పండ్లు సురక్షితమైనవి కావు అనే భావన పూర్తిగా అవాస్తవం. కొన్ని పండ్లు రక్తంలోని చక్కెర స్థాయిలను నియంత్రించడానికి అత్యుత్తమంగా సహాయపడుతాయి.
అవేంటో ఇక్కడ మనం తెలుసుకుందాం.. మొదటిది గ్రేప్ ఫ్రూట్. దీనిలో 91 శాతం నీరు ఉంటుంది. విటమిన్ సి నిల్వలు కూడా అధికంగా ఉంటాయి. రక్తంలోని చక్కెర స్థాయిలను నియంత్రణలో ఉంచేందుకు రోజూవారీ క్రమంలో భాగంగా గ్రేప్ ఫ్రూట్ తీసుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. రెండోది.. స్ట్రాబెర్రీస్ కూడా దీనిని నియంత్రించడానికి సహాయపడే విటమిన్స్, యాంటీ ఆక్సిడెంట్స్ మరియు ఫైబర్ తో లోడ్ చేయబడి ఉంటాయి.
ఆరెంజ్ లో కూడా విటమిన్ సి మరియు థయామిన్ వంటి పోషకాలు ఎక్కువగా ఉండటం మూలంగా చక్కెర స్థాయిలు అదుపులో ఉంచడానికి సహాయపడుతాయి. ఇంకా ఇలా చెప్పుకుంటూ పోతే.. ఆపిల్, బొప్పాయి, ఉసిరి, దానిమ్మ, ఫైనాపిల్, అవగాడో , పుచ్చకాయలు, డ్రాగన్ ఫ్రూట్, పీయర్స్ వంటి పండ్లల్లో చెక్కర స్థాయిని నియంత్రించే విటమిన్లు ఉంటాయి.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…