Tag Archives: ancrestal gods

పిండ ప్రధానం కాకులకే ఎందుకు పెడతారు..?

సాధారణంగా మన హిందూ సాంప్రదాయాలు ఎన్నో ఆచారాలు పాటిస్తుంటారు. ఇందులో భాగంగానే చనిపోయిన తర్వాత చనిపోయిన వారికి పిండం ప్రధానం చేయడం కూడా ఒక ఆచారంగానే వస్తుంది. అదే విధంగా ప్రతి పుష్కరాలకు లేదా సంవత్సరం రోజు చనిపోయిన వారికి పిండ ప్రధానం చేయడం మనం చూస్తూనే ఉంటాం.అయితే ఈ పిండప్రధానం చేసేటప్పుడు మనం మన పితృదేవతలకు సమర్పించిన పిండాన్ని కాకులు తినాలని భావిస్తుంటారు. ఆ విధంగా కాకులు తినడం ద్వారా మన పితృదేవతలకు ఆత్మ శాంతి కలుగుతుందని నమ్మకం. అయితే పిండాన్ని కాకులకి ఎందుకు పెడతారు? ఆ విధంగా కాకులకు పెట్టడానికి గల కారణం ఏమిటి అనే విషయాలను గురించి ఇక్కడ తెలుసుకుందాం.

పురాణాల ప్రకారం రావణాసురుడుకి భయపడిన యమధర్మరాజు కాకులకు ఒక వరం ఇస్తాడు. ఎవరైతే చనిపోయి ఉంటారో వారు నరకానికి వెళ్లి బాధలను అనుభవిస్తుంటారు. అలాంటి వారికి నరక బాధలు నుంచి విముక్తి కలగాలంటే వారి కుటుంబ సభ్యులు పిండప్రధానం చేసినప్పుడు కాకుల ఎవరి పిండాన్ని అయితే తింటాయో వారికి నరక బాధల నుంచి విముక్తి కలుగుతుందనే వరాన్ని ప్రసాదిస్తాడు. అందువల్ల పిండ ప్రదానం చేసే టప్పుడు కాకులకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు.

ఈ విధంగా ప్రతిసారీ పిండప్రదానం చేసినప్పుడు కాకులు ఆ పిండాన్ని తినకపోతే తమ పితృ దేవతలకు ఏవో తీరని కోరికలు ఉన్నాయని, వారి ఆత్మకు శాంతి ఇ కలగలేదని భావిస్తుంటారు. అయితే కొందరు మాత్రం పూర్వకాలంలో పశుపక్ష్యాదులకు ఆహారంగా ఈ పిండ ప్రదానం చేసే వారని,అప్పట్లో కాకులు ఎక్కువగా ఉండటం వల్ల ఈ పిండాన్ని కాకులు తినేవి. అప్పటి నుంచి ఇప్పటికీ వరకు పిండాన్ని కాకులు తినడం ఒక ఆచారంగా పాటిస్తున్నారని మరి కొందరు భావిస్తుంటారు.