Tag Archives: AP Floods

ఏపీ వరద సహాయానికి కోటి రూపాయలు విరాళం ప్రకటించిన ప్రభాస్!

గత పది రోజుల క్రితం ఆంధ్రప్రదేశ్లోని పలు జిల్లాలను వరదలు ముంచెత్తాయి. అధిక వర్షాలు పడటంతో రాయలసీమలోని పలు జిల్లాలలో, నెల్లూరు జిల్లాలో వాగులు వంకలు పొంగి పొర్లి పెద్ద ఎత్తున ఆస్తినష్టం, పంట నష్టం, ప్రాణ నష్టం జరిగింది. ఈ క్రమంలోనే వెంటనే ఏపీ ప్రభుత్వం కేంద్రాన్ని సహాయం కోరుతూ వరద ప్రాంతాల్లో పెద్ద ఎత్తున సహాయ చర్యలను చేపట్టింది. ఇదిలా ఉండగా ఏపీ వరద బాధితుల కోసం పలువురు సినీ ప్రముఖులు ఏపీ సీఎం రిలీఫ్ ఫండ్ కు విరాళాలు ప్రకటించారు.

ఇప్పటికే ఎన్టీఆర్, మహేష్ బాబు, చిరంజీవి, రామ్ చరణ్, అల్లు అర్జున్, గీత ఆర్ట్స్ అల్లు అర్జున్ వంటి వారు పెద్ద ఎత్తున విరాళాలు ప్రకటించారు. తాజాగా రెబల్ స్టార్ ప్రభాస్ ఏపీ వరద బాధితుల కోసం సీఎం రిలీఫ్ ఫండ్ కు కోటి రూపాయలు విరాళంగా ప్రకటించారు. త్వరలోనే కోటి రూపాయల చెక్కును సీఎం కార్యాలయానికి పంపించనునట్లు తెలుస్తోంది.

ఈ విధంగా ప్రభాస్ ఏపీ వరద సహాయ నిధికి కోటి రూపాయలు విరాళం ప్రకటించడంతో పెద్దఎత్తున ఆయన ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇది మాత్రమే కాకుండా కరోనా సమయంలో కూడా ప్రభాస్ 50 లక్షల విరాళం ప్రకటించిన సంగతి తెలిసిందే. బాహుబలి సినిమా ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాలతో ఎంతో బిజీగా ఉన్నారు.

ఈ క్రమంలోనే రాధాకృష్ణ దర్శకత్వంలో ప్రభాస్,పూజ హెగ్డే జంటగా రాధే శ్యామ్ చిత్రం ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. అలాగే ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సలార్ షూటింగ్ జరుగుతుంది. అలాగే ఆదిపురుష్ చిత్రంలో నటిస్తున్నారు.అలాగే మరికొన్ని సినిమాలకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

తిరుపతిలో వింత ఘటన.. ఆశ్చర్యపోతున్న ప్రజలు..!

ఇటీవల తమిళనాడులో కురిసిన భారీ వర్షాల కారణంగా అక్కడి జనజీవనం అస్తవ్యస్తంగా తయారైంది. దాని ఎఫెక్ట్ మన ఆంధ్రప్రదేశ్ లో ఉన్న తిరుపతికి తాకింది. అక్కడ కూడా విపరీతమైన వర్షం కురవడంతో.. తిరుమలపై ఎన్నో కట్టడాలు నేలమట్టం అయ్యాయి. భక్తులు వెళ్లే దారి మొత్తం స్తంభించిపోయింది.

తిరుమల దర్శనానికి వచ్చే భక్తులను కూడా రావొద్దని అధికారులు సూచించారు. అయితే అక్కడి పరిస్థితులు ఇప్పుడు బాగానే ఉన్నాయి. భక్తులు కూడా వెళ్లి దర్శనం చేసుకుంటున్నారు. అయితే శ్రీకృష్ణానగర్‌లో వింత ఘటన చోటుచేసుకుంది. సిమెంట్ రింగులతో నిర్మించిన ఓ వాటర్ ట్యాంక్​.. భూమిలోంచి పైకి వచ్చింది. దీన్ని చూసిన స్థానికులు ఆశ్చర్యానికి గురయ్యారు.

వర్షాల కారణంగా నీరంతా ఒకేదగ్గర చేరడంతో.. తిరుపతి శ్రీ కృష్ణా నగర్‌లో అక్కడి కట్టడాలు, వస్తువుల అన్నీ మునిగిపోయాయి. అక్కడ భూమి లోపల పాతిపెట్టిన ఓ నీటి ట్యాంక్ ను శుభ్రం చేస్తుండగా.. భూమి ఉపరితలం పైకి ఎగసి వచ్చింది. అది దాదాపు 25 సిమెంట్ వరలతో నిర్మించారు. దాదాపు అది 25 అడుగుల విస్తీర్ణంతో ఉంది.

ఇలాంటిది ఒక్కసారిగా బయటపడటం కాస్త ఆసక్తికరంగా మారింది. నీటి తొట్టిలోకి దిగి మహిళ శుభ్రం చేస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. ఆ సమయంలో ఆమె ఒక్కసారిగి ఉలిక్కిపడిపోయింది. కంగారు పడి కళ్లు మూసుకున్న సందరు మహిళ కళ్లు తెరిచి చూసే సరికి భూమి ఉపరితలంలో ఉంది. ప్రస్తుతం ఈ ఘటన అక్కడ సంచలనంగా మారింది.