ఇటీవల తమిళనాడులో కురిసిన భారీ వర్షాల కారణంగా అక్కడి జనజీవనం అస్తవ్యస్తంగా తయారైంది. దాని ఎఫెక్ట్ మన ఆంధ్రప్రదేశ్ లో ఉన్న తిరుపతికి తాకింది. అక్కడ కూడా విపరీతమైన వర్షం కురవడంతో.. తిరుమలపై ఎన్నో కట్టడాలు నేలమట్టం అయ్యాయి. భక్తులు వెళ్లే దారి మొత్తం స్తంభించిపోయింది.
తిరుమల దర్శనానికి వచ్చే భక్తులను కూడా రావొద్దని అధికారులు సూచించారు. అయితే అక్కడి పరిస్థితులు ఇప్పుడు బాగానే ఉన్నాయి. భక్తులు కూడా వెళ్లి దర్శనం చేసుకుంటున్నారు. అయితే శ్రీకృష్ణానగర్‌లో వింత ఘటన చోటుచేసుకుంది. సిమెంట్ రింగులతో నిర్మించిన ఓ వాటర్ ట్యాంక్.. భూమిలోంచి పైకి వచ్చింది. దీన్ని చూసిన స్థానికులు ఆశ్చర్యానికి గురయ్యారు.
వర్షాల కారణంగా నీరంతా ఒకేదగ్గర చేరడంతో.. తిరుపతి శ్రీ కృష్ణా నగర్‌లో అక్కడి కట్టడాలు, వస్తువుల అన్నీ మునిగిపోయాయి. అక్కడ భూమి లోపల పాతిపెట్టిన ఓ నీటి ట్యాంక్ ను శుభ్రం చేస్తుండగా.. భూమి ఉపరితలం పైకి ఎగసి వచ్చింది. అది దాదాపు 25 సిమెంట్ వరలతో నిర్మించారు. దాదాపు అది 25 అడుగుల విస్తీర్ణంతో ఉంది.
ఇలాంటిది ఒక్కసారిగా బయటపడటం కాస్త ఆసక్తికరంగా మారింది. నీటి తొట్టిలోకి దిగి మహిళ శుభ్రం చేస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. ఆ సమయంలో ఆమె ఒక్కసారిగి ఉలిక్కిపడిపోయింది. కంగారు పడి కళ్లు మూసుకున్న సందరు మహిళ కళ్లు తెరిచి చూసే సరికి భూమి ఉపరితలంలో ఉంది. ప్రస్తుతం ఈ ఘటన అక్కడ సంచలనంగా మారింది.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…