ఎంతో మందికి తెలుగు సినీ పరిశ్రమకు కొరియోగ్రాఫర్లను పరిచయం చేసిన షో ‘ఢీ’. ప్రస్తుతం ఇది 12 సీజన్లను పూర్తి చేసుకొని 13 వ సీజన్ ఫినాలేలోకి అడుగుపెట్టేసింది. ఇది దక్షిణ భారతదేశంలోనే బిగ్గెస్ట్ రియాల్టీ షోగా పేరొందింది. ఇక వచ్చే వారం నుంచి ఈ షో ఫినాలే ఎపిసోడ్ జరగబోతుంది. అయితే, అంతకంటే ముందే అంటే తాజాగా ఈ సీజన్ విన్నర్ పేరు లీకైపోయింది.
వివరాల్లోకి వెళ్తే.. ప్రతీ సీజన్ లో ఏదో క్యాప్షన్ పేరిట ఢీ షో ప్రసారం అవుతోంది. ఈ సీజన్లో మొదటి సారిగా కింగ్స్ వర్సెస్ క్వీన్స్ గా పేరు పెట్టారు. అమ్మాయిలు, అబ్బాయిలకు మధ్య పోటీగా మొదలెట్టారు. కింగ్స్ టీమ్‌కు సుడిగాలి సుధీర్, హైపర్ ఆది.. క్వీన్స్ జట్టుకు రష్మీ గౌతమ్, దీపిక పిల్లి మెంటర్లుగా వ్యవహరిస్తున్నారు. జడ్జ్‌లుగా గణేష్ మాస్టర్, పూర్ణ, ప్రియమణిలు ఉన్నారు.
స్టార్ యాంకర్ ప్రదీప్ మాచిరాజు హోస్ట్ చేస్తున్నాడు. ఇక ఈ షోలో డ్యాన్స్ లతో అలరించడమే కాకుండా.. ప్రదీప్, సుధీర్, హైపర్ ఆది కామెడీ ఓ రేంజిలో ఉంటుంది. కామెడీని పండించడంలో కూడా వీళ్లు సఫలం అయ్యారు. అయితే ఇక ఇది చివరి దశకు చేరుకుంది. ఫినాలేలో నైనిక, కావ్యశ్రీ, కార్తీక్, సాయిలు టైటిల్ కోసం పోటీ పడబోతున్నారు. ఫైనల్ ఎపిసోడ్ కు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ వచ్చారు.
అతడి చేతుల మీదుగానే ఫైనల్ విన్నర్ ను అనౌన్స్ చేశారు. ఈ షో విజేత ఎవరనే సస్పెన్స్ ఈ వైరల్ వీడియో వలన వీడిపోయింది. విజేతను ప్రకటించే విషయాన్ని స్పష్టంగా తెలియజేసే విషయాన్ని వీడియో ద్వారా తెలిపారు. ఇంతకూ ఆ విన్నర్ ఎవరంటే.. ‘కావ్య’ అంటూ సోషల్ మీడియాలో పోస్టులు వైరల్ అవుతూ ఉన్నాయి.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…