Tag Archives: AP tenth class

ఏపీ పదో తరగతి విద్యార్థులకు జగన్ సర్కార్ తీపికబురు..!

దేశంలో, తెలుగు రాష్ట్రాల్లో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కరోనా మహమ్మారి కట్టడి కోసం కీలక నిర్ణయాలు తీసుకుంటున్నాయి. అయితే వైరస్ ను పూర్తిస్థాయిలో కట్టడి చేయడంలో సక్సెస్ కాలేకపోతున్నాయి. వేగంగా విజృంభిస్తున్న కరోనా మహమ్మారి ప్రభావం దేశంలోని అన్ని రంగాలపై పడగా విద్యారంగంపై ఆ ప్రభావం ఎక్కువగా ఉంది.

అయితే ఎన్ని రోజులైనా పరిస్థితుల్లో పెద్దగా మార్పు రాని నేపథ్యంలో జగన్ సర్కార్ విద్యాసంవత్సరం ప్రారంభం కోసం నెమ్మదిగా అడుగులు వేస్తోంది. రాష్ట్రంలో పదో తరగతి చదువుతున్న విద్యార్థుల కోసం జగన్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ఉమ్మడి ప్రవేశ పరీక్షను నిర్వహించి ఈ ఏడాదికి ట్రిపుల్ ఐటీ ప్రవేశాలను కల్పించాలని జగన్ సర్కార్ భావిస్తోంది. దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి 2008లో రాష్ట్రంలోను పదో తరగతిలో ఉత్తమ ప్రతిభ చూపిన విద్యార్థుల కోసం ప్రవేశపెట్టారు.

ప్రతి సంవత్సరం పదో తరగతి పరీక్ష ఫలితాల ఆధారంగా ట్రిపుల్ ఐటీ ప్రవేశాలు జరిగేవి. అయితే కరోనా వైరస్ విజృంభణ వల్ల ఈ ఏడాది పదో తరగతి పరీక్షలు నిర్వహించకపోవడంతో ట్రిపుల్ ఐటీ ప్రవేశాల విషయంలో ఇబ్బందులు ఎదురయ్యాయి. దీంతో ఉమ్మడి ప్రవేశ పరీక్ష ద్వారా పదో తరగతి విద్యార్థులకు ప్రవేశాలు కల్పిస్తామని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ వెల్లడించారు.

ప్రభుత్వం విద్యా సంవత్సరం వృథా కాకూడదనే ఉద్దేశంతో రెండో తేదీ నుంచి పాఠశాలల ఓపెనింగ్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలిపారు. 1, 3, 5, 7 తరగతుల విద్యార్ధులకు ఒకరోజు 2,4,6.8 తరగతులకు మరో రోజు క్లాసులు జరుగుతాయని మంత్రి వెల్లడించారు.