Tag Archives: Asaravelli

Manchu Lakshmi: శ్రీకాకుళంలో సందడి చేసిన మంచు లక్ష్మి….ఈమె క్రేజ్ మామూలుగా లేదుగా!

Manchu Lakshmi:మోహన్ బాబు వారసురాలిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన మంచు లక్ష్మీ ఎన్నో విభిన్నమైన సినిమాలలో నటించి సందడి చేశారు.ఇలా విభిన్న పాత్రలలో నటిస్తూ ఇండస్ట్రీలో కొనసాగుతున్నటువంటి ఈమె తాజాగా మోహన్ లాల్ నటించిన మాన్ స్టర్ సినిమాలో లెస్బియన్ పాత్రలో నటించి అందరిని ఆశ్చర్యానికి గురి చేశారు.

ఈ సినిమాలో మంచు లక్ష్మీ నటన మరో లెవల్ కి చేరిందని ఈమె పాత్రకు మంచి మార్కులు పడ్డాయి. ఇక ఈ సినిమా మంచి విజయాన్ని అందుకోవడంతో మంచు లక్ష్మి తాజాగా శ్రీకాకుళంలో సందడి చేశారు. తన తండ్రి మోహన్ బాబు సూచనలు మేరకు ఈమె శ్రీకాకుళంలోని అసరవెల్లి సూర్యనారాయణ స్వామివారిని దర్శించుకున్నట్లు సమాచారం.

ఇక మంచు లక్ష్మి శ్రీకాకుళం వస్తున్నారని తెలియడంతో పెద్ద ఎత్తున అభిమానులు అక్కడికి చేరుకొని సందడి చేశారు. ఈమెకు పూల వర్షంతో స్వాగతం పలుకుతూ పెద్ద ఎత్తున తమ అభిమానాన్ని చాటుకున్నారు.ఇలా మంచు లక్ష్మి ని చూడటం కోసం పెద్ద ఎత్తున అభిమానులు అక్కడికి చేరుకోవడంతో శ్రీకాకుళంలో మంచు లక్ష్మి క్రేజ్ చూసి ప్రతి ఒక్కరు ఆశ్చర్యపోతున్నారు.

Manchu Lakshmi:పాఠశాలలలో స్మార్ట్ క్లాసులు నిర్వహిస్తున్న మంచు లక్ష్మి..

ప్రస్తుతం మంచు లక్ష్మి శ్రీకాకుళం ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక శ్రీకాకుళంలో మంచు లక్ష్మీ మాట్లాడుతూ టీచ్ ఫర్ చేంజ్ అనే ఎన్జీఓ తరుపున 475 పాఠశాలలలో స్మార్ట్ క్లాసులు నిర్వహిస్తున్నామని రాబోయే రెండు సంవత్సరాలలో ప్రతి ఒక్కరూ ఫ్లూయెంట్ ఇంగ్లీషులో మాట్లాడతారని, ఇది వారి భవిష్యత్తుకు ఎంతో ఉపయోగపడుతుందని ఈమె వెల్లడించారు.