Manchu Lakshmi:మోహన్ బాబు వారసురాలిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన మంచు లక్ష్మీ ఎన్నో విభిన్నమైన సినిమాలలో నటించి సందడి చేశారు.ఇలా విభిన్న పాత్రలలో నటిస్తూ ఇండస్ట్రీలో కొనసాగుతున్నటువంటి ఈమె తాజాగా మోహన్ లాల్ నటించిన మాన్ స్టర్ సినిమాలో లెస్బియన్ పాత్రలో నటించి అందరిని ఆశ్చర్యానికి గురి చేశారు.
ఈ సినిమాలో మంచు లక్ష్మీ నటన మరో లెవల్ కి చేరిందని ఈమె పాత్రకు మంచి మార్కులు పడ్డాయి. ఇక ఈ సినిమా మంచి విజయాన్ని అందుకోవడంతో మంచు లక్ష్మి తాజాగా శ్రీకాకుళంలో సందడి చేశారు. తన తండ్రి మోహన్ బాబు సూచనలు మేరకు ఈమె శ్రీకాకుళంలోని అసరవెల్లి సూర్యనారాయణ స్వామివారిని దర్శించుకున్నట్లు సమాచారం.
ఇక మంచు లక్ష్మి శ్రీకాకుళం వస్తున్నారని తెలియడంతో పెద్ద ఎత్తున అభిమానులు అక్కడికి చేరుకొని సందడి చేశారు. ఈమెకు పూల వర్షంతో స్వాగతం పలుకుతూ పెద్ద ఎత్తున తమ అభిమానాన్ని చాటుకున్నారు.ఇలా మంచు లక్ష్మి ని చూడటం కోసం పెద్ద ఎత్తున అభిమానులు అక్కడికి చేరుకోవడంతో శ్రీకాకుళంలో మంచు లక్ష్మి క్రేజ్ చూసి ప్రతి ఒక్కరు ఆశ్చర్యపోతున్నారు.
ప్రస్తుతం మంచు లక్ష్మి శ్రీకాకుళం ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక శ్రీకాకుళంలో మంచు లక్ష్మీ మాట్లాడుతూ టీచ్ ఫర్ చేంజ్ అనే ఎన్జీఓ తరుపున 475 పాఠశాలలలో స్మార్ట్ క్లాసులు నిర్వహిస్తున్నామని రాబోయే రెండు సంవత్సరాలలో ప్రతి ఒక్కరూ ఫ్లూయెంట్ ఇంగ్లీషులో మాట్లాడతారని, ఇది వారి భవిష్యత్తుకు ఎంతో ఉపయోగపడుతుందని ఈమె వెల్లడించారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…