Tag Archives: awards

Rajamouli: సినిమాల కోసమే నేను సినిమాలు చేస్తా..రాజమౌళి కామెంట్స్ వైరల్!

Rajamouli: భారతదేశంలో నెంబర్ వన్ డైరెక్టర్ గా గుర్తింపు పొందిన వారిలో రాజమౌళి కూడా ఒకరు. స్టూడెంట్ నెంబర్ వన్ సినిమా ద్వారా దర్శకుడిగా మారిన రాజమౌళి ఇటీవల విడుదలైన ఆర్ఆర్ఆర్ సినిమా వరకు ఆయన దర్శకత్వం వహించిన అన్ని సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్ అయ్యాయి. ఇక ఇటీవల విడుదలైన ఆర్ఆర్ సినిమా మన తెలుగు సినిమా గొప్పతనాన్ని ప్రపంచానికి తెలియజేసింది. ఈ సినిమాకు దర్శకత్వం వహించిన రాజమౌళి ప్రపంచవ్యాప్తంగా దర్శకుడిగా మంచి గుర్తింపు పొందాడు.

ఇలా ప్రతి సినిమా దర్శకత్వంలో రాజమౌళి తన మార్క్ చూపిస్తూ తన స్థాయిని మరింత పెంచుకుంటున్నాడు. ఇదిలా ఉండగా ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న రాజమౌళి ఆయన దర్శకత్వం వహించిన సినిమాల గురించి మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
ఈ క్రమంలో రాజమౌళి మాట్లాడుతూ.. ” తాను పురస్కారాలు, బిరుదులు, అవార్డులు ఆశించి సినిమాలు తీయడం లేదని, కేవలం డబ్బు కోసం మాత్రమే సినిమాలు తీస్తున్నాను అంటూ రాజమౌళి సంచలన వ్యాఖ్యలు చేశాడు.

తాను దర్శకత్వం వహించిన సినిమా ఎంత వసూలను రాబడుతుందని ముందుగా అంచనా వేసుకొని సినిమాలు చేస్తానని ఈయన వెల్లడించారు. అంతే కాకుండా తన దర్శకత్వంలో వచ్చిన సినిమా అద్భుతమైన కలెక్షన్లను రాబట్టిన తర్వాత ఆ సినిమాకు వచ్చే అవార్డులు రివార్డులను అదనపు ఫలితంగా భావిస్తానని రాజమౌళి ఈ సందర్భంగా సంచలన వ్యాఖ్యలు చేశాడు. తాను దర్శకత్వం వహించిన సినిమా ప్రేక్షకులకు నచ్చే భారీ వసూళ్లు రాబట్టడమే తన లక్ష్యంగా వెల్లడించాడు. ఇలా కేవలం వసూళ్లను దృష్టిలో పెట్టుకుని సినిమా చేసినప్పుడు మాత్రమే ఆ సినిమా హిట్ అవుతుందని ఆయన తెలియజేశాడు. అలా కాకుండా కేవలం అవార్డులు, బిరుదుల కోసం సినిమా చేస్తే ఆ సినిమా కోసం కొన్ని వందల కోట్ల బడ్జెట్ కేటాయించిన నిర్మాత అన్యాయం అయిపోతాడు.

Rajamouli: సినిమా కలెక్షన్స్ ముఖ్యం…

ఇలా ఇప్పటికే ఎంతోమంది నిర్మాతలు నష్టపోయి ఇండస్ట్రీకి దూరం అయ్యారు. కనుక తన నిర్మాతలను దృష్టిలో పెట్టుకొని వారికి ఇటువంటి పరిస్థితి ఎదురవకూడదనే ఉద్దేశంతో ఇలాంటి నియమాలు పాటిస్తున్నానని రాజమౌళి వెల్లడించాడు. అయితే కేవలం డబ్బు కోసమే సినిమాలు చేస్తానని రాజమౌళీ చేసిన వ్యాఖ్యలపై కొందరు పాజిటివ్ గా స్పందిస్తుంటే మరికొందరు మాత్రం నెగిటివ్గా కామెంట్స్ చేస్తున్నారు.

బిరుదులు, అవార్డులంటే ఇష్టం లేదు.. వాటికి తాను అర్హుడిని కాదు: సీనీ నటుడు చంద్రమోహన్

కథానాయకుడిగా సీని పరిశ్రమలోకి వచ్చి ఆ తర్వాత సహాయ నటుడిగా, హాస్య నటుడిగా ఎన్నో విలక్షణమైన పాత్రలతో మెప్పించిన నటుడు చంద్రమోహన్. 55ఏళ్ల సినీ ప్రయాణంలో దాదాపు 900లకు పైగా సినిమాల్లో నటించారు. కేవలం హీరో పాత్రలు మాత్రమే చేయాలని కాకుండా, అన్ని రకాల పాత్రలను పోషించాడు. ఈ క్రమంలో నిర్విరామంగా పనిచేస్తూ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేశాడు.

రాఖీ సినిమా షూటింగ్‌ అయిన వెంటనే బైపాస్ సర్జరీ చేయించుకున్నాడు. దువ్వాడ జగన్నాథమ్ సినిమా సమయంలో కూడా ఆరోగ్య సమస్యలు ఎదుర్కొన్నాడు. అప్పుడు షూటింగ్‌ కూడా వాయిదా వేయాల్సి వచ్చింది. ఈ సందర్భంగా అతడు ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తనకు సినిమాలు, క్రీడలు అంటే చాలా ఇష్టమని చెప్పుకొచ్చాడు. అతేకాకుండా వ్యాపారం అంటే కూడా ఇష్టమని.. ఆ మక్కువతోనే అతడు వ్యాపారంలో దిగగా.. అతడికి అచ్చి రాలేదని చెప్పుకొచ్చాడు.

తర్వాత సినిమాలపైనే ఎక్కువగా ఇష్టం కలిగిందని చెప్పడు. అంతేకాకుండా.. తనకు బిరుదులు, అవార్డులు అంటే అస్సలు ఇష్టం ఉండదన్నారు. పద్మ శ్రీ, పద్మభూషణ్ లాంటి వాటికి దూరంగా ఉంటానన్నారు. ఎందుకంటే.. తన కంటే గొప్ప గొప్ప నటులకు పద్మ అవార్డులు రాలేదు. వాళ్లకంటే తక్కువ స్థాయిలో ఉన్న నాకు ఈ అవార్డులు ఇస్తానంటే తాను ఓప్పుకోనని చెప్పుకొచ్చాడు. అతడి ఆరోగ్యంపై ఇటీవల సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి.

అవన్నీ ఫేక్ అని.. తాను బాగానే ఉన్నట్లు చెప్పాడు చంద్రమోహన్. అంతేకాకుండా ఓ కమెడియన్ కు గిన్నీస్ బుక్ లో రికార్డు సొంతం చేసుకున్నాడు.. వెంటనే పద్మ అవార్డు అతడికి వరించింది..దీనిపై అతడు స్పందిస్తూ.. గిన్నీస్ బుక్ లో రికార్డు సొంతం చేసుకుంటే.. పద్మ శ్రీకి అర్హులు ఎలా అవుతారని చంద్రమోహన్ ఓ ఇంటర్వ్యూ సందర్భంగా ప్రశ్నించారు.