Tag Archives: Bank customer

హోమ్ లోన్ తీసుకునే అద్భుత ఆఫర్.. పంజాబ్ నేషన్ బ్యాంక్ ప్రకటించిన ఆఫర్ వివరాలివే..

హోమ్ లోన్ తీసుకునే వారికి పంజాబ్ నేషనల్ బ్యాంక్ బంపర్ ఆఫర్ ప్రకటించింది. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఈ ఆఫర్ వెల్లడించింది. గృహ రుణ ఆఫర్ కింద ప్రాసెసింగ్ ఫీజులు, డాక్యుమెంటేషన్ ఛార్జీలను పూర్తిగా మినహాయించినట్లు తెలిపింది. ఈ ఆఫర్ సెప్టెంబర్ 30 వరకు మాత్రమే ఉంటుందని తెలిపింది. ఆ బ్యాంక్ కస్టమర్లకు కేవలం 6.68 శాతం వరకు మాత్రమే వడ్డీని వసూలు చేయనున్నారు.

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా హోమ్ లోన్లపై వడ్డీరేటును తగ్గిస్తున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఎస్బీఐ కార్ లోన్స్, కార్ ఆన్ రోడ్ ధరలో 90 శాతం వరకు రుణాల కోసం ప్రాసెసింగ్ ఫీజులను మాఫీ చేసింది. యోనో యాప్ ద్వారా దఖాస్తు చేసుకునే వారికి ప్రత్యేకంగా 0.25 శాతం డిస్కౌంట్ పొందుతారు. గోల్డ్ లోన్ తీసుకునే వారికి కూడా ఎస్బీఐ ఈ ఆఫర్లను ప్రకటించింది. ఇదిలా ఉండగా తాజాగా పంజాబ్ నేషనల్ బ్యాంక్ తన కస్టమర్లను అలర్ట్ చేసింది. కొన్ని గంటల పాటు బ్యాంకింగ్ సేవలు నిలిపివేయనున్నట్లుగా ట్వీట్ చేస్తూ.. క్షమాపణలు చెప్పింది.

ఆగస్టు 18 అర్థరాత్రి నుంచి ఆగస్టు 19 ఉదయం వరకు సేవలు నిలిచిపోయాయి. నిర్వహణ కారణంగా ఆన్ లైన్ బ్యాంకింగ్, ఇంటర్నెట్ బ్యాంకింగ్ సర్వీస్, కార్పొరేట్ బ్యాంకింగ్ సర్వీస్, యూపీఐ, ఐఎంపీఎస్ సహా అన్ని రకాల సౌకర్యాలలో అంతరాయం కలగనుందంటూ ట్వీట్ చేసింది. అంతే కాకుండా గోల్డ్ మానిటైజేషన్ కోసం ఈ బ్యాంక్ ఆఫర్ కల్పిస్తున్నట్లు తెలిపింది. 10 గ్రాముల బంగారాన్ని డిపాజిట్ చేసి.. వడ్డీని పొందొచ్చని తెలిపింది. ఈ డిపాజిట్ లు మూడు రకాలుగా ఉంటుంది. అందులో మొదటిది.. స్వల్పకాలిక డిపాజిట్ 1-3 సంవత్సరాలు.

మధ్యకాలిక డిపాజిట్లు 5-7 సంవత్సరాలు.. దీర్ఘకాలిక డిపాజిట్లు 12-15 సంవత్సరాల వరకు ఉంటాయి. స్వల్పకాలిక డిపాజిట్ల కింద, 1 సంవత్సరానికి 0.50 శాతం, 1-2 సంవత్సరాలకు 0.60 శాతం మరియు 2-3 సంవత్సరాలకు 0.75 శాతం వడ్డీ లభిస్తుంది. మధ్యకాలిక డిపాజిట్లపై వడ్డీ రేటు 2.25 శాతం, దీర్ఘకాలిక డిపాజిట్‌లకు 2.50 శాతం వడ్డీ లభించనున్నట్లు తెలిపింది. అయితే ఈ గోల్డ్ మానిటైజేషన్ అనేది మొదట్లో 30 గ్రాములు ఉన్న వారికి మాత్రమే అవకాశం కల్పించగా.. తాజాగా 10 గ్రాముల వారు కూడా డిపాజిట్ చేసే విధంగా అవకాశాన్ని కల్పించారు.

గోల్డ్ లోన్ తీసుకోవాలని అనుకుంటున్నారా.. బంపర్ ఆఫర్ ప్రకటించిన బ్యాంక్..!

బ్యాంక్‌ ఆఫ్‌ మహారాష్ట్ర తన కస్టమర్లకు అదిరిపోయే ఆఫర్‌ ప్రకటించింది. పండగ సీజన్ ను పురస్కరించుకొని ఈ ఆఫర్ ను ప్రకటించింది. బంగారం రుణం తీసుకునే వారు ఏ బ్యాంకులో అయినా ప్రాసెసింగ్ ఫీజు అనేది వసూలు చేస్తుంటారు. కానీ బ్యాంక్‌ ఆఫ్‌ మహారాష్ట్రలో మాత్రం బంగారం, హౌసింగ్‌ లోన్స్‌ వంటి రుణాలపై విధించే ప్రాసెసింగ్‌ ఫీజులను తొలగించాలని నిర్ణయించింది.

ఇక నుంచి హౌసింగ్ లోన్ తీసుకునే సమయంలో కూడా ఎలాంటి ఫీజులు కట్టాల్సిన అవసరం లేదు. అయితే ఇది దసరా కంటే ముందు అంటే సెప్టెంబర్ 30 నుంచి అమలు చేస్తామని తెలిపారు. దీంతో కస్టమర్లకు ఎంతో కొంత ఉపశమనం కలగనుంది. వీటితో పాటు అడ్మినిస్ట్రేటివ్‌ ఛార్జీలు, ప్రీపేమెంట్‌ పెనాల్టీ ఛార్జీలు, ఇతర ఛార్జీలు ఇవ్వన్ని కూడా ఉండవని తెలిపారు.

బ్యాంకు జారీ చేసిన ప్రకనటలో గృహ రుణంపై 6.90 శాతం వడ్డీ రేటుతో తీసుకోవచ్చు. అదే సమయంలో కారు రుణాలకు వడ్డీ రేటు 7.30 శాతంగా నిర్ణయించింది బ్యాంకు. బంగారు రుణ పథకంలో మార్పులు చేసినట్లు బ్యాంకు అధికారులు చెబుతున్నారు. రూ.20 లక్షల వరకు బంగారు రుణాలపై వడ్డీ రేట్లు 7.10 శాతం. అదే సమయంలో రూ. లక్ష వరకు బంగారు రుణాల ప్రాసెసింగ్‌ ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదని తెలియజేశారు.

బ్యాంకు జారీ చేసిన ప్రకటనలో గృహ రుణంపై రెగ్యులర్‌గా ఈఎంఐ చెల్లించే వారు రెండు ఈఎంఐలపై డిస్కౌంట్‌ పొందవచ్చని తెలిపారు. ఖాతాను క్లోజ్ చేసే వారు కూడా ఎలాంటి ఫీజులు చెల్లించాల్సిన అవసరం లేదని తెలిపారు.