బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర తన కస్టమర్లకు అదిరిపోయే ఆఫర్ ప్రకటించింది. పండగ సీజన్ ను పురస్కరించుకొని ఈ ఆఫర్ ను ప్రకటించింది. బంగారం రుణం తీసుకునే వారు ఏ బ్యాంకులో అయినా ప్రాసెసింగ్ ఫీజు అనేది వసూలు చేస్తుంటారు. కానీ బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రలో మాత్రం బంగారం, హౌసింగ్ లోన్స్ వంటి రుణాలపై విధించే ప్రాసెసింగ్ ఫీజులను తొలగించాలని నిర్ణయించింది.
ఇక నుంచి హౌసింగ్ లోన్ తీసుకునే సమయంలో కూడా ఎలాంటి ఫీజులు కట్టాల్సిన అవసరం లేదు. అయితే ఇది దసరా కంటే ముందు అంటే సెప్టెంబర్ 30 నుంచి అమలు చేస్తామని తెలిపారు. దీంతో కస్టమర్లకు ఎంతో కొంత ఉపశమనం కలగనుంది. వీటితో పాటు అడ్మినిస్ట్రేటివ్ ఛార్జీలు, ప్రీపేమెంట్ పెనాల్టీ ఛార్జీలు, ఇతర ఛార్జీలు ఇవ్వన్ని కూడా ఉండవని తెలిపారు.
బ్యాంకు జారీ చేసిన ప్రకనటలో గృహ రుణంపై 6.90 శాతం వడ్డీ రేటుతో తీసుకోవచ్చు. అదే సమయంలో కారు రుణాలకు వడ్డీ రేటు 7.30 శాతంగా నిర్ణయించింది బ్యాంకు. బంగారు రుణ పథకంలో మార్పులు చేసినట్లు బ్యాంకు అధికారులు చెబుతున్నారు. రూ.20 లక్షల వరకు బంగారు రుణాలపై వడ్డీ రేట్లు 7.10 శాతం. అదే సమయంలో రూ. లక్ష వరకు బంగారు రుణాల ప్రాసెసింగ్ ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదని తెలియజేశారు.
బ్యాంకు జారీ చేసిన ప్రకటనలో గృహ రుణంపై రెగ్యులర్‌గా ఈఎంఐ చెల్లించే వారు రెండు ఈఎంఐలపై డిస్కౌంట్ పొందవచ్చని తెలిపారు. ఖాతాను క్లోజ్ చేసే వారు కూడా ఎలాంటి ఫీజులు చెల్లించాల్సిన అవసరం లేదని తెలిపారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…