సినిమా ఇండస్ట్రీలో మాస్ మహారాజా రవితేజ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ఎలాంటి సినీ బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి కెరియర్ మొదట్లో సైడ్ ఆర్టిస్ట్ గా పని చేస్తున్నటువంటి రవితేజ ప్రస్తుతం స్టార్ హీరోగా కొనసాగుతున్నారు. ఈ క్రమంలోనే ఎన్నో అద్భుతమైన సినిమాలలో నటించి మంచి గుర్తింపును సంపాదించుకున్నారు.
రవితేజ నటించినటు వంటి సినిమాలలో నా ఆటోగ్రాఫ్ సినిమా ఒకటి. ఈ సినిమా ద్వారా ఎంతోమంది వారి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారని చెప్పవచ్చు. మరి ఈ సినిమాలో రవితేజ సరసన నటించినటువంటి హీరోయిన్ గోపిక అందరికీ గుర్తుండే ఉంటుంది. ఈ సినిమాలో రవితేజ లవర్ గా చేసినటువంటి గోపిక ఈ మధ్యకాలంలో సినిమాలలో కనిపించలేదు. మరి గోపిక ప్రస్తుతం ఏం చేస్తుంది.. ఎక్కడ ఉంది అనే విషయాలను తెలుసుకుందాం…
గోపిక కూడా ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు. ఆమె చదువుకునే రోజులలోనే ఆమెకు సినిమా అవకాశాలు రావడంతో మొట్టమొదటిసారిగా మలయాళంలో జయ సూర్య వంటి హీరోలతో కలిసి నటించింది. అయితే తను నటించిన మొదటి సినిమా పెద్దగా కలిసి రాలేదు. ఆ తర్వాత పలు తెలుగు మలయాళ సినిమాలను చేసిన గోపికకు ఇండస్ట్రీలో అవకాశాలు తగ్గిపోయాయి.
సినిమా ఇండస్ట్రీలో అవకాశాలు రాకపోయినప్పటికీ ఏ మాత్రం అవకాశాలు కోసం ఎదురు చూడకుండా ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగిని పెళ్లి చేసుకుని ఆస్ట్రేలియా వెళ్లిపోయారు. ప్రస్తుతం ఆస్ట్రేలియాలో ఇద్దరు పిల్లలతో గోపిక ఎంతో సంతోషంగా ఉన్నారు. గోపిక ఇండస్ట్రీకి దూరమైనప్పటికీ నిత్యం ఫోటోలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ అభిమానులకు దగ్గరగా ఉంటున్నారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…