ప్రతి బుధవారం బుల్లితెరపై ప్రసారమయ్యే”ఢీ”షో గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ షో ద్వారా ఎంతో మంది డాన్సర్లు వారి అద్భుతమైన ఫర్ఫార్మెన్స్ ద్వారా ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. ఇక ఈ కార్యక్రమానికి యాంకర్ ప్రదీప్ వ్యాఖ్యాతగా వ్యవహరించగా ఇందులో సుధీర్, హైపర్ ఆది, దీపిక పిల్లి, రష్మీ కింగ్ అండ్ క్వీన్స్ టీమ్ లకు లీడర్ గా ఉన్నారు. అదేవిధంగా ఈ కార్యక్రమానికి పూర్ణ, ప్రియమణి గణేష్ మాస్టర్ జడ్జిగా వ్యవహరించారు. తాజాగా ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమోను నిర్వాహకులు విడుదల చేశారు.
ఈ ప్రోమోలో భాగంగా ఈవారం టీమ్ లీడర్లు, జడ్జీలు సూపర్ సెలబ్రిటీల పాత్రలో అద్భుతంగా చేశారు.ఈ క్రమంలోనే సుడిగాలి సుదీర్ నరసింహ సినిమాలోని రజినీకాంత్ పాత్రలో సందడి చేయగా పూర్ణ రమ్యకృష్ణ పాత్రను ఎంతో అద్భుతంగా చేసింది. వీళ్లిద్దరు రజనీకాంత్ రమ్యకృష్ణ పాత్రలలో నరసింహ సినిమాను చూపించారు.
ఈ క్రమంలోనే ప్రియమణి సుధీర్ దగ్గరకు వచ్చి రమ్యకృష్ణ స్టైల్లో నువ్వు ఎంతో అదృష్టవంతుడివి.. నాకే నచ్చావు. రేపు మీ చెల్లి మా అన్నయ్య నిశ్చితార్థం రోజు నీ అభిప్రాయాన్ని చెప్పు. ఓకే నేనే చెప్తా నువ్వు సిగ్గు పడతావు అంటూ ప్రియమణి అక్కడినుండి వెళుతుండగా సుధీర్ రజిని స్టైల్ లో “మేడం జస్ట్ మినిట్..” మీరు మీ ఇష్టాన్ని చెప్పారు.నా ఇష్టాన్ని వినలేదు మీరు నాకు నచ్చలేదు అని చెప్పడంతో రమ్యకృష్ణ పాత్రలో ఉన్న ప్రియమణి కళ్ళజోడు తీయగా రజిని పాత్రలో ఉన్న సుధీర్ కళ్ళజోడును పెట్టుకోవడం ఎంతో స్టైల్ గా ఉంది.
అదేవిధంగా పూర్ణ శృంగార వీర..అనే పాటకు అద్భుతంగా డాన్స్ చేయగా సుధీర్ మరోసారి రజిని స్టైల్ లో అద్భుతమైన ఫర్ఫార్మెన్స్ చేశారు. ప్రస్తుతం ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ కార్యక్రమానికి సంబంధించిన పూర్తి ఎపిసోడ్ చూడాలి అంటే కార్యక్రమం ప్రసారం అయ్యే వరకు ఎదురు చూడాలి.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…