అప్పటి అందాల నటి సావిత్రి బయోపిక్ హీరోయిన్ కీర్తి సురేష్ చేసిన సంగతి తెలిసిందే. టైటిల్ పాత్రలో కీర్తి సురేష్ నటించిన నటనకి రాజకీయ నాయకులతో పాటు యావత్ దక్షిణ భారతదేశ చలనచిత్ర రంగ ప్రముఖులు శభాష్ అన్నారు. ఆ తరహాలో తన నటనతో మెప్పించిన కీర్తి సురేష్. ఆ నటనతోనే ఆమె అందానికి,అభినయానికి దాసోహమైంది ప్రేక్షక లోకం. అప్పటి నుంచి కీర్తి డిఫరెంట్ సినిమాలను ఎంచుకుంటూ ముందుకు సాగుతోంది.
కుర్ర హీరోలతో పాటు స్టార్ హీరోలతో నటిస్తున్న కీర్తి సురేష్ తాజాగా మెగాస్టార్ చిరంజీవితో నటించే అవకాశం దక్కించుకున్నట్లు ఇండస్ట్రీ వర్గాల టాక్. తమిళంలో అజిత్ నటించిన వేదాళం సినిమాని తెలుగులో చిరంజీవి రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. మెహర్ రమేశ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో చిరంజీవి హీరోగా నటించనున్నాడు. తమిళంలో హీరో చెల్లెలు పాత్ర సినిమాకి చాలా కీలకం.
ఈ నేపథ్యంలో సరిగ్గా చిరంజీవి చెల్లెలకు తగ్గ రీతిలో కీర్తి సురేష్ క్రేజ్ సరిపోతుందని.. డైరెక్టర్ డిసైడ్ అవ్వడం జరిగిందట. అక్టోబర్ మాసం నుండి.. ఈ సినిమాకి సంబంధించిన రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ కానున్నట్లు సమాచారం. ఈ సినిమా చాలా ఫాస్ట్గా కంప్లీట్ చేయాలనీ పక్కా షెడ్యూల్ తో ముందుకు వెళ్లాలని చిరు డైరెక్టర్ కి కఠిన ఆదేశాలు ఇచ్చినట్లు ఫిలిం వర్గాల టాక్. ఇదిలా ఉండగా కీర్తి సురేశ్ చెల్లెలుగా నటించడం ఇది కొత్తేమి కాదు.
సూపర్ స్టార్ రజనీకాంత్ ప్రధాన పాత్రలో నటిస్తున్న అన్నాత్తే సినిమాలో రజనీ సోదరిగా ఇప్పటికే కీర్తి నటిస్తోంది. వేదాళం రిమేక్ సినిమాలో గుండుతో కనిపించే సన్నివేశాల్లో చిరు నటించనున్నారని, ఇప్పటికే మేకప్ టెస్టు కూడా జరిగిందని టాలీవుడ్ లో వార్తలు వస్తున్నాయి. ఈ సినిమాలో చిరంజీవి చెల్లిగా నటించేందుకు సహజ నటి సాయిపల్లివితో పాటు పలువురు హీరోయిన్ల పేర్లను పరిశీలించారు. చివరికి ఈ సినిమాలో చెల్లెలుగా నటించేందుకు మహానటి కీర్తిసురేశ్ ను ఎంపిక చేసినట్టు టాలీవుడ్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే ఈ విషయం గురించి చిత్రబృందం అధికారికంగా మాత్రం వెల్లడికాలేదు.
తెలుగు ఇంటి వంటల్లో ఊరగాయకు ఉన్న స్థానం ప్రత్యేకం. వేడివేడి అన్నంలో ఒక ముద్ద పచ్చడి ఉంటే చాలు, భోజనానికి…
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా పర్యాటకం, ఉద్యోగాలు, వ్యాపార ప్రయాణాలు విపరీతంగా పెరిగిపోయాయి. ఒక నగరం నుంచి మరో నగరానికి, ఒక దేశం…
ప్రస్తుతం ప్రభుత్వ రంగ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన బ్యాంక్ ఆఫ్ బరోడా…
తెలంగాణలో క్రికెట్‌కు మరింత ప్రోత్సాహం అందించే లక్ష్యంతో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న టీజీ20 లీగ్ ప్రారంభానికి సర్వం…
తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు యాంకర్‌గా, నటిగా సుపరిచితమైన విష్ణుప్రియ భీమినేని మరోసారి వార్తల్లో నిలిచారు. టెలివిజన్ షోలు, రియాలిటీ కార్యక్రమాలు,…
వ్యవసాయం అనేది దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక. రైతు సంతోషంగా ఉంటేనే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుంది. అయితే…