తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లోనే కాదు మన భారతదేశంలో ప్రజలు ఎన్నో సాంప్రదాయ పద్ధతులను, ఆచారాలను పాటించడమే కాకుండా ఎన్నో నమ్మకాలను కూడా పెద్ద ఎత్తున విశ్వసిస్తుంటారు. అయితే కొన్ని నమ్మకాలు ప్రజల్లో మూఢ నమ్మకంలా బలంగా నాటుకుపోయాయి. ఈ కోవలోకి ఇప్పడు మనం చెప్పుకునేది చేరుతుంది. అదేంటంటే.. కాకి తలపైన తన్నితే చాలామంది అపశకునంగా భావిస్తారు. ఏదో చెడు జరుగుతుందని నమ్ముతారు. కాకి తలపై తన్నితే మరణ వార్త వింటారని.. ఏడేళ్ల పాటు శని తాండవిస్తుందని నమ్ముతుంటారు.
నిజానికి కాకిని పితృదేవతలకు ప్రతినిధి పిలుస్తారు. ఇంటి దగ్గర గోడపై వాలి కాకి అరిస్తే ఇంటికి బంధువులు వస్తారని చాలా మంది నమ్ముతారు. కాకి బంధువులు వచ్చే విషయాన్ని ముందుగానే పసిగడుతుందా అని చాలా మందికి సందేహం ఉంటుంది. ఇళా పక్షులు ఎవరైనా కావాల్సిన వారు ఇంటికి వస్తే అరుస్తాయనేది నమ్మకంగా ఉండిపోయింది.
ఇలా కాకి అరుపులు శుభవార్తలాగా చెప్పుకునే మనం కాకి తలమీద తన్నితే ఎందుకు అశుభంగా చెప్పుకుంటుంన్నాం. ఎందుకంటే.. కాకికి గోళ్లు పదునుగా ఉంటాయి. ఆహార అన్వేషణలో గోళ్లలో ఏమైనా క్రిములు, కుళ్లిన మాసం ఉండిపోతుంది. అది ఫాస్ట్ గా వచ్చి మనల్ని తన్నడం వల్ల ఆ క్రిములు శరీరంలోకి చేరడంతో వ్యాధుల బారిన పడతాం.
అందుకే కాకి తన్నితే అశుభం అని అంటుంటారు. కాకి తన్నిన వెంటనే స్నానం చేస్తే తన్నిన చోటు ఉన్న క్రిములు పోతాయని జ్యోతిష్యులు చెబుతున్నారు. కాకుల వల్ల ఇంకా ఉపయోగాలెన్నో ఉన్నాయి. అతిథుల రాకను తెలియజేస్తుంది.. నీటితో నిండిన కుండపై కాకి వాలితే మంచిదని.. కాకికి ప్రతీ రోజు ఆహారం పెడితే రోజూ లక్ష్మి కరునిస్తుందని.. ఇలా ఎన్నో విశ్వాసాలను నమ్ముతారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…