Tag Archives: Bharat Electronics Limited

ఇంజనీరింగ్, ఎంబీఏ చదివిన వాళ్లకు శుభవార్త.. రూ.35 వేల వేతనంతో ఉద్యోగాలు..?

భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్(బెల్) నిరుద్యోగులకు అదిరిపోయే శుభవార్త చెప్పింది. కేంద్ర ప్రభుత్వ రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన బెల్ కంపెనీ 137 ట్రెయినీ ఇంజినీర్ ఉద్యోగాల భర్తీ కోసం నిరుద్యోగుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. కాంట్రాక్ట్ ప్రాతిపదిన ఈ ఉద్యోగాల భర్తీ జరగనుంది. ఇప్పటికే ఈ ఉద్యోగాలకు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కాగా ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఆన్ లైన్ లో ఈ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

ఇంజనీరింగ్, ఎంబీఏ ఫైనాన్స్ చదివిన వాళ్లు ఈ ఉద్యోగాల కొరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఉద్యోగాలకు ఎంపికైన వాళ్లు గజియాబాద్ లోని బెల్ కంపెనీలో పని చేయాల్సి ఉంటుంది. https://www.bel-india.in/ వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. మొత్తం 137 ఉద్యోగాలలో ట్రెయినీ ఇంజినీర్ ఉద్యోగాలు 70 ఉండగా ప్రాజెక్ట్ ఇంజినీర్ ఉద్యోగాలు 61, ట్రెయినీ ఆఫీసర్ ఉద్యోగాలు 6 ఉన్నాయి.

ఈ ఉద్యోగాలకు ఆన్ లైన్ ద్వారా మాత్రమే దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంటుంది. అయితే అర్హతతో పాటు అనుభవం ఉన్నవాళ్లు మాత్రమే ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ట్రెయినీ ఆఫీస‌ర్ ‌(జ‌న‌ర‌ల్‌) ఉద్యోగాలకు 25 సంవత్సరాలు, ప్రాజెక్ట్ ఇంజనీర్ ఉద్యోగాలకు 28 సంవత్సరాల లోపు అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. అయితే ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ అభ్యర్థులకు నిబంధనల మేరకు వయో సడలింపులు ఉంటాయి.

ప్రాజెక్ట్ ఇంజనీర్ ఉద్యోగాలకు వేతనం 35,000 రూపాయలు కాగా ట్రెయినీ ఇంజనీర్, ట్రెయినీ ఆఫీసర్ ఉద్యోగాలకు 25,000 రూపాయల వేతనం లభిస్తుంది. జనరల్, ఈడ‌బ్ల్యూఎస్, ఓబీసీ అభ్యర్థులు ప్రాజెక్ట్ ఇంజనీర్ ఉద్యోగాలకు 500 రూపాయలు. ట్రెయినీ ఇంజనీర్, ట్రెయినీ ఆఫీసర్ ఉద్యోగాలకు 200 రూపాయలు దరఖాస్తు ఫీజుగా చెల్లించాల్సి ఉంటుంది.

నిరుద్యోగులకు మరో శుభవార్త.. 50,000 వేతనంతో ఉద్యోగాలు!

గత కొన్ని రోజుల నుంచి నిరుద్యోగులకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ సంస్థలు, బ్యాంకులు, రైల్వే శాఖ వరుస నోటిఫికేషన్లను విడుదల చేస్తూ వరుస శుభవార్తలు చెబుతున్న సంగతి తెలిసిందే. తాజాగా భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ నిరుద్యోగులకు అదిరిపోయే శుభవార్త చెప్పింది. నిరుద్యోగులకు ప్రయోజనం చేకూరేలా బెల్ కీలక నిర్ణయం తీసుకుంది. వివిధ నోటిఫికేషన్ల ద్వారా దేశవ్యాప్తంగా ఉన్న 1,059 ఖాళీలను భర్తీ చేయడానికి బెల్ సిద్ధమైంది.

భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ నుంచి ఇప్పటికే ప్రాజెక్ట్ ఇంజనీర్, ట్రైనీ ఇంజనీర్ ఉద్యోగాలతో పాటు మరికొన్ని ఉద్యోగాలకు నోటిఫికేషన్లు వెలువడ్డాయి. బెంగ‌ళూరు యూనిట్‌, ఎక్స్‌పోర్ట్ మాన్యుఫ్యాక్చ‌రింగ్ ఎస్‌బీయూ, ఐపీఎస్ఎస్ ప్రాజెక్ట్‌ (బెంగ‌ళూరు), పంచ‌కుల యూనిట్‌ లలో ఖాళీలు ఉన్నాయి. ఈ ఉద్యోగాలకు రాత పరీక్షలో వచ్చిన మార్కులను బట్టి ఎంపిక చేస్తారు. ఉద్యోగాలకు కేవలం ఆన్ లైన్ లో మాత్రమే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

https://bel-india.in/ వెబ్ సైట్ ను సందర్శించి ఉద్యోగాలకు సంబంధించిన పూర్తి సమాచారంన్ తెలుసుకోవచ్చు. కొన్ని ఉద్యోగాలకు నవంబర్ 21 చివరి తేదీ కాగా, మరికొన్ని ఉద్యోగాలకు నవంబర్ 25 ఆఖరు తేదీ. ట్రయినీ ఆఫీస‌ర్‌, ఇంజినీర్ పోస్టుల‌కు దరఖాస్తు ఫీజు 200 రూపాయలు, ప్రాజెక్ట్ ఆఫీస‌ర్ ఉద్యోగలకు 500 రూపాయలు దరఖాస్తు ఫీజుచెల్లించాల్సి ఉంటుంది.

బీఈ లేదా బీటెక్ లేదా బీఆర్చ్ లేదా బీఎస్సీ చదివిన అభ్యర్థులు పోస్టును బట్టి ఈ ఉద్యోగాల కొరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఫైనాన్స్ పోస్టులకు, హెచ్ఆర్ పోస్టుల‌కు ఎంబీఏ చేసిన వాళ్లు మాత్రమే అర్హులు.