భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్(బెల్) నిరుద్యోగులకు అదిరిపోయే శుభవార్త చెప్పింది. కేంద్ర ప్రభుత్వ రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన బెల్ కంపెనీ 137 ట్రెయినీ ఇంజినీర్ ఉద్యోగాల భర్తీ కోసం నిరుద్యోగుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. కాంట్రాక్ట్ ప్రాతిపదిన ఈ ఉద్యోగాల భర్తీ జరగనుంది. ఇప్పటికే ఈ ఉద్యోగాలకు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కాగా ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఆన్ లైన్ లో ఈ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
ఇంజనీరింగ్, ఎంబీఏ ఫైనాన్స్ చదివిన వాళ్లు ఈ ఉద్యోగాల కొరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఉద్యోగాలకు ఎంపికైన వాళ్లు గజియాబాద్ లోని బెల్ కంపెనీలో పని చేయాల్సి ఉంటుంది. https://www.bel-india.in/ వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. మొత్తం 137 ఉద్యోగాలలో ట్రెయినీ ఇంజినీర్ ఉద్యోగాలు 70 ఉండగా ప్రాజెక్ట్ ఇంజినీర్ ఉద్యోగాలు 61, ట్రెయినీ ఆఫీసర్ ఉద్యోగాలు 6 ఉన్నాయి.
ఈ ఉద్యోగాలకు ఆన్ లైన్ ద్వారా మాత్రమే దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంటుంది. అయితే అర్హతతో పాటు అనుభవం ఉన్నవాళ్లు మాత్రమే ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ట్రెయినీ ఆఫీసర్ (జనరల్) ఉద్యోగాలకు 25 సంవత్సరాలు, ప్రాజెక్ట్ ఇంజనీర్ ఉద్యోగాలకు 28 సంవత్సరాల లోపు అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. అయితే ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ అభ్యర్థులకు నిబంధనల మేరకు వయో సడలింపులు ఉంటాయి.
ప్రాజెక్ట్ ఇంజనీర్ ఉద్యోగాలకు వేతనం 35,000 రూపాయలు కాగా ట్రెయినీ ఇంజనీర్, ట్రెయినీ ఆఫీసర్ ఉద్యోగాలకు 25,000 రూపాయల వేతనం లభిస్తుంది. జనరల్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ అభ్యర్థులు ప్రాజెక్ట్ ఇంజనీర్ ఉద్యోగాలకు 500 రూపాయలు. ట్రెయినీ ఇంజనీర్, ట్రెయినీ ఆఫీసర్ ఉద్యోగాలకు 200 రూపాయలు దరఖాస్తు ఫీజుగా చెల్లించాల్సి ఉంటుంది.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…