Categories: FeaturedMovie News

దివిసీమ తుఫాన్ విషయంలో హీరో నరసింహరాజు పేపర్ స్టేట్మెంట్ ఎందుకు కాంట్రవర్సీ అయ్యిందో తెలుసా.?!

ఏ.ఎన్.ఆర్, ఎన్టీఆర్ లు సినిమాలు చూసి సంతోషపడే నరసింహ రాజు అద్దంలో తన ముఖం చూసుకొని అచ్చు హీరోలా గా ఉన్నానని మురిసిపోయాడు. ఇంట్లో చెప్పకుండానే మద్రాసు రైలెక్కేశాడు. అక్కడ సినిమా అవకాశాల కోసం ప్రయత్నించాడు. కానీ అవకాశాలు ఏమీ రాలేదు. చేతిలో డబ్బు అయిపోవడం మూలాన తిరిగి పశ్చిమ గోదావరి జిల్లా తన సొంతూరు వడ్లూరుకు రావడం జరిగింది. తల్లిదండ్రుల సపోర్ట్ తీసుకుని తిరిగి మద్రాసు వెళ్లిపోయారు. అలా నరసింహ రాజు1974లో నీడలేని ఆడది సినిమాలో నటించారు. ఆ తర్వాత తమిళంలో కె.బాలచందర్ దర్శకత్వంలో 1975 లో వచ్చిన అపూర్వ రాగంగల్ సినిమాని తెలుగులో దాసరి దర్శకత్వంలో పునర్నిర్మించారు.

ఆ తూర్పు పడమర సినిమాలో శ్రీవిద్య సరసన నరసింహరాజు నటించారు. ఆ తర్వాత సినిమా అవకాశాలు పెద్దగా రాకపోవడంతో విఠలాచార్య జగన్మోహిని తీస్తున్నారని తెలిసి ఆయనను కలవడానికి వెళ్లారు. అంతకుముందే విఠలాచార్య కూడా నరసింహారాజు ను హీరోగా పెట్టి జగన్మోహిని తీద్దాం అనుకున్నారు. ఆ క్రమంలో 1978లో జగన్మోహిని చిత్రంలో నరసింహరాజు జయమాలిని హీరో హీరోయిన్లుగా నటించారు. ఆ తర్వాత గంధర్వ కన్య, మంత్రదండం, పున్నమినాగు పునాదిరాళ్లు లాంటి చిత్రాల్లో నరసింహరాజు నటించారు. అయితే 1977 నవంబర్లో వచ్చిన దివిసీమ తుఫాను తెలుగు ప్రజల బతుకుల్ని అతలాకుతలం చేసింది. దాదాపు నాలుగు లక్షల జంతువులు చనిపోయాయి. 8300 మంది ప్రజలు చనిపోయారని ఒక అంచనా, 80కి పైగా గ్రామాలు కొట్టుకుపోయాయి.

ఆంధ్రప్రదేశ్ చరిత్రలోనే కనీవినీ ఎరుగని అతిపెద్ద ప్రకృతి వైపరీత్యం గా దీనిని పేర్కొన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దీనిమీద స్పందించాయి. తెలుగు సినీ పరిశ్రమ దివిసీమ వైపరీత్యాన్ని చూసి బాధిత కుటుంబాలకు ఆర్థిక సహాయాన్ని అందించాలనే ఉద్దేశంతో సినీ పరిశ్రమ పెద్దలు ఎన్టీఆర్, ఏఎన్నార్ లాంటి వారు ప్రజల వద్దకు వెళ్లి చందాలు వసూలు చేసి వసూలైన మొత్తాన్ని ప్రజలకు ఖర్చు చేయాలనుకున్నారు. ఆ క్రమంలో హీరో నరసింహరాజు ఇలా చందాలు వసూలు చేసేకంటే ఈ స్టార్ హీరోలే ఫ్రీగా ఓ సినిమా చేసి వచ్చిన డబ్బులు బాధిత ప్రజలకు ఇస్తే బాగుంటుంది కదా అని సదుద్దేశంతో చెప్పినప్పటికీ అది కాస్త ఆ రోజుల్లో కాంట్రవర్సీ గా మారింది.

Lavanya Suresh

Lavanya Suresh is Senior News Reporter in Telugudesk.net. Lavanya Suresh covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది..

హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…

1 month ago

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

3 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

3 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

4 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

4 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

4 months ago