గత కొన్ని రోజుల నుంచి నిరుద్యోగులకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ సంస్థలు, బ్యాంకులు, రైల్వే శాఖ వరుస నోటిఫికేషన్లను విడుదల చేస్తూ వరుస శుభవార్తలు చెబుతున్న సంగతి తెలిసిందే. తాజాగా భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ నిరుద్యోగులకు అదిరిపోయే శుభవార్త చెప్పింది. నిరుద్యోగులకు ప్రయోజనం చేకూరేలా బెల్ కీలక నిర్ణయం తీసుకుంది. వివిధ నోటిఫికేషన్ల ద్వారా దేశవ్యాప్తంగా ఉన్న 1,059 ఖాళీలను భర్తీ చేయడానికి బెల్ సిద్ధమైంది.
భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ నుంచి ఇప్పటికే ప్రాజెక్ట్ ఇంజనీర్, ట్రైనీ ఇంజనీర్ ఉద్యోగాలతో పాటు మరికొన్ని ఉద్యోగాలకు నోటిఫికేషన్లు వెలువడ్డాయి. బెంగళూరు యూనిట్, ఎక్స్‌పోర్ట్ మాన్యుఫ్యాక్చరింగ్ ఎస్‌బీయూ, ఐపీఎస్ఎస్ ప్రాజెక్ట్ (బెంగళూరు), పంచకుల యూనిట్ లలో ఖాళీలు ఉన్నాయి. ఈ ఉద్యోగాలకు రాత పరీక్షలో వచ్చిన మార్కులను బట్టి ఎంపిక చేస్తారు. ఉద్యోగాలకు కేవలం ఆన్ లైన్ లో మాత్రమే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
https://bel-india.in/ వెబ్ సైట్ ను సందర్శించి ఉద్యోగాలకు సంబంధించిన పూర్తి సమాచారంన్ తెలుసుకోవచ్చు. కొన్ని ఉద్యోగాలకు నవంబర్ 21 చివరి తేదీ కాగా, మరికొన్ని ఉద్యోగాలకు నవంబర్ 25 ఆఖరు తేదీ. ట్రయినీ ఆఫీసర్, ఇంజినీర్ పోస్టులకు దరఖాస్తు ఫీజు 200 రూపాయలు, ప్రాజెక్ట్ ఆఫీసర్ ఉద్యోగలకు 500 రూపాయలు దరఖాస్తు ఫీజుచెల్లించాల్సి ఉంటుంది.
బీఈ లేదా బీటెక్ లేదా బీఆర్చ్ లేదా బీఎస్సీ చదివిన అభ్యర్థులు పోస్టును బట్టి ఈ ఉద్యోగాల కొరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఫైనాన్స్ పోస్టులకు, హెచ్ఆర్ పోస్టులకు ఎంబీఏ చేసిన వాళ్లు మాత్రమే అర్హులు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…