గత కొన్ని రోజుల నుంచి నిరుద్యోగులకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ సంస్థలు, బ్యాంకులు, రైల్వే శాఖ వరుస నోటిఫికేషన్లను విడుదల చేస్తూ వరుస శుభవార్తలు చెబుతున్న సంగతి తెలిసిందే. తాజాగా భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ నిరుద్యోగులకు అదిరిపోయే శుభవార్త చెప్పింది. నిరుద్యోగులకు ప్రయోజనం చేకూరేలా బెల్ కీలక నిర్ణయం తీసుకుంది. వివిధ నోటిఫికేషన్ల ద్వారా దేశవ్యాప్తంగా ఉన్న 1,059 ఖాళీలను భర్తీ చేయడానికి బెల్ సిద్ధమైంది.

భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ నుంచి ఇప్పటికే ప్రాజెక్ట్ ఇంజనీర్, ట్రైనీ ఇంజనీర్ ఉద్యోగాలతో పాటు మరికొన్ని ఉద్యోగాలకు నోటిఫికేషన్లు వెలువడ్డాయి. బెంగ‌ళూరు యూనిట్‌, ఎక్స్‌పోర్ట్ మాన్యుఫ్యాక్చ‌రింగ్ ఎస్‌బీయూ, ఐపీఎస్ఎస్ ప్రాజెక్ట్‌ (బెంగ‌ళూరు), పంచ‌కుల యూనిట్‌ లలో ఖాళీలు ఉన్నాయి. ఈ ఉద్యోగాలకు రాత పరీక్షలో వచ్చిన మార్కులను బట్టి ఎంపిక చేస్తారు. ఉద్యోగాలకు కేవలం ఆన్ లైన్ లో మాత్రమే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

https://bel-india.in/ వెబ్ సైట్ ను సందర్శించి ఉద్యోగాలకు సంబంధించిన పూర్తి సమాచారంన్ తెలుసుకోవచ్చు. కొన్ని ఉద్యోగాలకు నవంబర్ 21 చివరి తేదీ కాగా, మరికొన్ని ఉద్యోగాలకు నవంబర్ 25 ఆఖరు తేదీ. ట్రయినీ ఆఫీస‌ర్‌, ఇంజినీర్ పోస్టుల‌కు దరఖాస్తు ఫీజు 200 రూపాయలు, ప్రాజెక్ట్ ఆఫీస‌ర్ ఉద్యోగలకు 500 రూపాయలు దరఖాస్తు ఫీజుచెల్లించాల్సి ఉంటుంది.

బీఈ లేదా బీటెక్ లేదా బీఆర్చ్ లేదా బీఎస్సీ చదివిన అభ్యర్థులు పోస్టును బట్టి ఈ ఉద్యోగాల కొరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఫైనాన్స్ పోస్టులకు, హెచ్ఆర్ పోస్టుల‌కు ఎంబీఏ చేసిన వాళ్లు మాత్రమే అర్హులు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here