కాంట్రాక్ట్ ఉద్యోగులకు సీఎం జగన్ అదిరిపోయే శుభవార్త..?

0
227

ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి కాంట్రాక్ట్ ఉద్యోగులకు అదిరిపోయే శుభవార్త చెప్పారు. 2021 సంవత్సరం మార్చి నెల 31వ తేదీ వరకు కాంట్రాక్ట్ ఉద్యోగుల సర్వీసులను పొడిగిస్తున్నట్టు ఉత్తర్వులు విడుదల చేశారు. న్యాయశాఖ, సాంస్కృతిక పర్యాటక శాఖ, యువజన సర్వీసులు, కుటుంబ సంక్షేమం, వైద్యం, ఆరోగ్యం, పాఠశాల, ఉన్నత విద్యాశాఖల్లోని కాంట్రాక్ట్ సర్వీసులను పొడిగిస్తున్నట్టు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

జగన్ సర్కార్ తీసుకున్న ఈ నిర్ణయం పట్ల నిరుద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. సీఎం జగన్ కాంట్రాక్ట్ ఉద్యోగులకు గడువును పొడిగించటంతో పాటు కీలక నిర్ణయాలను తీసుకున్నారు. రెగ్యులర్ ఉద్యోగులకు ఏ విధంగా వేతనాలను చెల్లిస్తారో కాంట్రాక్ట్ ఉద్యోగులకు కూడా అదే విధంగా చెల్లించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. కాంట్రాక్ట్ ఉద్యోగులను జీతాల విషయంలో ఇబ్బంది పెట్టవద్దని చెప్పారు.

పర్మినెంట్ ఉద్యోగులకు ఏ విధంగా సామాజిక, ఆరోగ్య భద్రత కల్పిస్తున్నామో కాంట్రాక్ట్ ఉద్యోగులకు కూడా అదే విధంగా సామాజిక, ఆరోగ్య భద్రత కల్పించడం కోసం అధ్యయనం చేయాలని సీఎం జగన్ అధికారులకు సూచించారు. అధ్యయనం అనంతరం తనకు పూర్తి వివరాలను అందజేయాలని జగన్ అధికారులకు చెప్పారు.

ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో ఉద్యోగులకు, వ్యాపారులకు, రైతులకు, విద్యార్థులకు, మహిళలకు ప్రయోజనం చేకూర్చేలా వరుసగా కీలక నిర్ణయాలు తీసుకుంటూ ప్రశంసలు అందుకుంటున్నారు. కరోనా, లాక్ డౌన్ వల్ల ఆర్థికపరమైన ఇబ్బందులు ఎదురవుతున్నా సీఎం జగన్ మాత్రం అన్ని వర్గాల ప్రజలకు మేలు జరిగేలా నిర్ణయాలు తీసుకుంటూ ఉండటం గమనార్హం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here