Tag Archives: Bhavya Creations

Sudheer Babu: వివాదంలో సుధీర్ బాబు హంట్ సినిమా టైటిల్.. కాఫీ కొట్టారంటున్న యంగ్ హీరో?

Sudheer Babu: సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో కొన్నిసార్లు ఇద్దరు హీరోలు ఒకే టైటిల్ తో సినిమాలను చేస్తుంటారు. అయితే ఆ సినిమా టైటిల్ పోస్టర్ విడుదలైనప్పుడు పెద్ద ఎత్తున వివాదాలకు కారణం అవుతుంటాయి. ప్రస్తుతం ఇలాంటి వివాదంలో చిక్కుకున్నారు నటుడు సుధీర్ బాబు.

సుధీర్ బాబు హీరోగా భవ్య క్రియేషన్స్ బ్యానర్ పై వి. ఆనంద ప్రసాద్ నిర్మాణంలో ‘హంట్’ అనే థ్రిల్లర్ మూవీ షూటింగ్ పనులను జరుపుకుంటుంది. ఈ క్రమంలోని ఈ సినిమా టైటిల్ పోస్టర్ ప్రకటించడంతో పెద్ద ఎత్తున వివాదంలో చిక్కుకుంది. ఇకపోతే శ్రీ క్రియేషన్స్’ పతాకం పై నిక్షిత్ హీరోగా, దర్శకుడిగా… నర్సింగ్ రావు నిర్మాతగా ‘హంట్’ పేరుతో మరో సినిమా కూడా రూపొందుతుంది. అయితే ఈ సినిమా నుంచి ఇప్పటికే మోషన్ పోస్టర్ కూడా విడుదల చేశారు.

ఈ క్రమంలోనే శ్రీ క్రియేషన్స్ బ్యానర్ ఈ విషయంపై స్పందిస్తూ మేము ఈ సినిమా టైటిల్ ఫిలిం ఛాంబర్ లో రిజిస్ట్రేషన్ చేసుకుని ఆరు నెలలు అయింది. అదే విధంగా ఈ సినిమా నుంచి మోషన్ పోస్టర్ కూడా విడుదల చేసాము. ఇలా మా సినిమాకు రిజిస్టర్ చేసుకున్న టైటిల్ భవ్య క్రియేషన్స్ వారు ఎలా పెట్టుకుంటారు అంటూ ప్రశ్నించారు. ఇదే విషయమే ఫిలిం ఛాంబర్ లో కంప్లైంట్ చేసినప్పటికీ ఎలాంటి ఫలితం లేకుండా పోయింది అంటూ శ్రీ క్రియేషన్స్ నిర్మాత, దర్శకుడు ఆవేదన వ్యక్తం చేశారు.

Sudheer Babu: రాయల్ గా దొంగతనం చేశారు..

ఇక ఈ విషయంపై శ్రీ క్రియేషన్స్ బ్యానర్ లో తెరకెక్కుతున్న హంట్ సినిమా హీరో నిక్షిత్ మాట్లాడుతూ మేము ఆరు నెలల క్రితమే రిజిస్టర్ చేసుకున్న హంట్ సినిమా టైటిల్ ను ఎంతో రాయల్ గా భవ్య క్రియేషన్స్ వారు దొంగతనం చేశారు అంటూ ఆరోపించారు. ఈ విషయం పై ఫిలిం ఛాంబర్ లో ఫిర్యాదు చేసిన మాకు ఎలాంటి ప్రయోజనం కలగలేదు పూర్తిగా అన్యాయం జరిగింది అంటూ ఆరోపణలు చేశారు. మరి ఈ విషయం లో ఎవరు వెనక్కి తగ్గుతారనే విషయం తెలియాల్సి ఉంది.