Sudheer Babu: సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో కొన్నిసార్లు ఇద్దరు హీరోలు ఒకే టైటిల్ తో సినిమాలను చేస్తుంటారు. అయితే ఆ సినిమా టైటిల్ పోస్టర్ విడుదలైనప్పుడు పెద్ద ఎత్తున వివాదాలకు కారణం అవుతుంటాయి. ప్రస్తుతం ఇలాంటి వివాదంలో చిక్కుకున్నారు నటుడు సుధీర్ బాబు.
సుధీర్ బాబు హీరోగా భవ్య క్రియేషన్స్ బ్యానర్ పై వి. ఆనంద ప్రసాద్ నిర్మాణంలో ‘హంట్’ అనే థ్రిల్లర్ మూవీ షూటింగ్ పనులను జరుపుకుంటుంది. ఈ క్రమంలోని ఈ సినిమా టైటిల్ పోస్టర్ ప్రకటించడంతో పెద్ద ఎత్తున వివాదంలో చిక్కుకుంది. ఇకపోతే శ్రీ క్రియేషన్స్’ పతాకం పై నిక్షిత్ హీరోగా, దర్శకుడిగా… నర్సింగ్ రావు నిర్మాతగా ‘హంట్’ పేరుతో మరో సినిమా కూడా రూపొందుతుంది. అయితే ఈ సినిమా నుంచి ఇప్పటికే మోషన్ పోస్టర్ కూడా విడుదల చేశారు.
ఈ క్రమంలోనే శ్రీ క్రియేషన్స్ బ్యానర్ ఈ విషయంపై స్పందిస్తూ మేము ఈ సినిమా టైటిల్ ఫిలిం ఛాంబర్ లో రిజిస్ట్రేషన్ చేసుకుని ఆరు నెలలు అయింది. అదే విధంగా ఈ సినిమా నుంచి మోషన్ పోస్టర్ కూడా విడుదల చేసాము. ఇలా మా సినిమాకు రిజిస్టర్ చేసుకున్న టైటిల్ భవ్య క్రియేషన్స్ వారు ఎలా పెట్టుకుంటారు అంటూ ప్రశ్నించారు. ఇదే విషయమే ఫిలిం ఛాంబర్ లో కంప్లైంట్ చేసినప్పటికీ ఎలాంటి ఫలితం లేకుండా పోయింది అంటూ శ్రీ క్రియేషన్స్ నిర్మాత, దర్శకుడు ఆవేదన వ్యక్తం చేశారు.
ఇక ఈ విషయంపై శ్రీ క్రియేషన్స్ బ్యానర్ లో తెరకెక్కుతున్న హంట్ సినిమా హీరో నిక్షిత్ మాట్లాడుతూ మేము ఆరు నెలల క్రితమే రిజిస్టర్ చేసుకున్న హంట్ సినిమా టైటిల్ ను ఎంతో రాయల్ గా భవ్య క్రియేషన్స్ వారు దొంగతనం చేశారు అంటూ ఆరోపించారు. ఈ విషయం పై ఫిలిం ఛాంబర్ లో ఫిర్యాదు చేసిన మాకు ఎలాంటి ప్రయోజనం కలగలేదు పూర్తిగా అన్యాయం జరిగింది అంటూ ఆరోపణలు చేశారు. మరి ఈ విషయం లో ఎవరు వెనక్కి తగ్గుతారనే విషయం తెలియాల్సి ఉంది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…