Gopichand: టాలీవుడ్ ఇండస్ట్రీలో నటుడిగా, విలన్ గా తన కెరియర్ ప్రారంభించి అనంతరం హీరోగా పలు సినిమాలలో నటిస్తూ ఇండస్ట్రీలో ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు నటుడు గోపీచంద్. హిట్టు ఫ్లాపులతో సంబంధం లేకుండా వరుస సినిమాలలో నటిస్తూ ఇండస్ట్రీలో ఈయన ఎంతో క్రేజ్ సొంతం చేసుకున్నారు..
ఇకపోతే సోషల్ మీడియాలో చాలా తక్కువగా కనిపించే గోపీచంద్ తాజాగా తన కుమారుడితో కలిసి దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ క్రమంలోనే ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. సీనియర్ హీరో శ్రీకాంత్ మేనకోడలు రేష్మని గోపీచంద్ వివాహం చేసుకున్నారు. ఈ దంపతులకు ఇద్దరు కుమారులు కాగా పెద్ద కుమారుడికి తన తండ్రి కృష్ణ గారి పేరును పెట్టుకున్నారు.
ఇక గోపీచంద్ రెండవ కుమారుడు పేరు వియాన్.తాజాగా తన రెండవ కుమారుడితో కలిసి దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ క్రమంలోనే ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో ఎంతో మంది ఈ ఫోటోలు చూసి బాబు ఎంతో క్యూట్ గా ఉన్నారు అంటూ కామెంట్లు చేస్తున్నారు. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
సాధారణంగా అందరి హీరోలు మాదిరిగా గోపీచంద్ సోషల్ మీడియాలో ఎక్కువగా యాక్టివ్ గా ఉండరు. కేవలం తన సినిమాలకు సంబంధించిన విషయాలను అలాగే తన పిల్లల పుట్టిన రోజు వేడుకల సమయంలో మాత్రమే వారి కుటుంబానికి సంబంధించిన విషయాలను షేర్ చేస్తుంటారు. ఎక్కువగా ఈయన సినిమాలకు సంబంధించిన విషయాలను మాత్రమే సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంటారు.ఇక తాజాగా మారుతి దర్శకత్వంలో నటించిన పక్కా కమర్షియల్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు ఈ సినిమా అనుకున్న స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…